టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ( Choreographer Johnny Master )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జానీ మాస్టర్.
అలాగే చాలా షో లకు జడ్జిగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే.అలా బుల్లితెర ప్రేక్షకులకు బాగానే చేరువ అయ్యారు.
ఇకపోతే ఇటీవల జానీ మాస్టర్ ఒక లేడీ కొరియోగ్రాఫర్( Lady choreographer ) లైంగిక వేధింపుల విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.సదరు లేడీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద కేసు పెట్టడంతో కొద్దిరోజుల పాటు జైలు జీవితం కూడా గడిపి వచ్చారు.

ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడు మళ్ళీ సినిమాలలో బిజీ బిజీ అవుతున్నారు.జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ మా సర్కు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా జైలు నుంచి వచ్చిన తర్వాత రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, అక్షయ్ కుమార్ ( Game Changer, Akshay Kumar )స్కై ఫోర్స్ తో పాటు పలు సినిమాలకు నృత్య రీతులు సమకూర్చాడు.ఆ మధ్యన ఒక కన్నడ సినిమా సెట్ లోనూ సందడి చేశాడు.
అలాగే సన్నీ డియోల్, గోపిచంద్ మలినేని సినిమా జాట్ కు కూడా జానీనే కొరియోగ్రఫీ అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా జాట్ సినిమాలోనే జానీ మాస్టర్ కూతురు అలియా పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు స్టార్ కొరియోగ్రాఫర్.హీరోయిన్ రెజీనా, రణ్ దీప్ హుడా, రవిశంకర్, డైరెక్టర గోపీ చంద్ మలినేని తదితరులు జానీ మాస్టర్ కూతురికి బర్త్ డే విషెస్ చెప్పి దీవెనలు అందించారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఫోటోలను చూసిన జానీ మాస్టర్ అభిమానులు చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అయితే జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత జానీ మాస్టర్ ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలలో బిజీబిజీ అవుతున్నారు.ఆయనకు అవకాశాలు కూడా బాగానే వస్తున్నట్టు తెలుస్తోంది.