ప్రియదర్శికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన పాన్ ఇండియా స్టార్ కపుల్స్... ఖుషి అవుతున్న హీరో!

ప్రియదర్శి (Priyadarshi)ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు.తాజాగా ఈయన నాని నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోర్ట్ (Court)అనే సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు.

 Suriya And Jyothika Gives Big Surprise To Actor Priyadarshi , Priyadarshi, Court-TeluguStop.com

ఈ సినిమాలో ప్రియదర్శి లాయర్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా తర్వాత ప్రియదర్శని నటించిన సారంగపాణి జాతకం అనే సినిమా కూడా ఏప్రిల్ 25వ తేదీ విడుదల అయ్యి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇలా వరుస హిట్ సినిమాల ద్వారా ప్రియదర్శి ప్రస్తుతం కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా కోర్టు సినిమాలో లాయర్ పాత్రలో ప్రియదర్శించిన తీరు అందరిని ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా సినీ సెలబ్రిటీల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటూ వచ్చారు.అయితే తాజాగా ఈ హీరోకి పాన్ ఇండియా స్టార్ కపుల్స్ అయినా సూర్య(Suriya) జ్యోతిక (Jyithika)నుంచి ఊహించని సర్ప్రైజ్ వచ్చిందని చెప్పాలి.

సూర్య జ్యోతిక కోర్టు సినిమా చూసిన అనంతరం ప్రియదర్శి నటనకు ప్రశంసలు కురిపిస్తూ ఆయనకు ఒక లెటర్ తో పాటు ఫ్లవర్ బొకేని కూడా కానుకగా పంపించారు.

Telugu Jyothika, Priyadarshi, Suriya, Suriyajyothika-Telugu Top Posts

ఇక ఈ విషయాన్ని స్వయంగా ప్రియదర్శి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… మీరు పంపిన బొకేతో సందేశాన్ని అందుకోవడం నా హృదయానికి తాకిందని.ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనంటూ చెప్పుకొచ్చాడు.చంద్రు వెంబ అనే ఇద్దరు గొప్ప న్యాయవాదులు నన్ను వెనుక నుంచి నా భుజం తట్టినట్టు అయింది.

నన్ను బాగా ప్రేరేపించిన ఈ జంటకు చాలా ధన్యవాదాలు అంటూ ఈయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube