ముఖ్యంగా చెప్పాలంటే దానిమ్మకాయలు( Pomegranate ) తినడం వల్ల కలిగే ప్రయోజనాలు దాదాపు చాలా మందికి తెలుసు.దానిమ్మ పండు తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కానీ వాటి వల్ల కూడా చాలా సమస్యలు వస్తాయని చాలామందికి తెలియదు.కొన్ని సమయాలలో మనకి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు దాన్ని తీసుకుంటే మనకి చాలా ఇబ్బంది కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
అనారోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.దానిమ్మ పండును క్రమం తప్పకుండా తింటే అల్సర్స్ ( Ulcers ) సమస్య ఉన్నా సరే అది చాలా త్వరగా నయం అవుతుంది.
అలాగే నడుము నొప్పితో చాలా బాధపడుతూ ఉన్న వాళ్ళు కానీ ప్రతిరోజు దానిమ్మ జ్యూస్ తీసుకుని దాంట్లో కాస్త తేనె కలుపుకొని తాగితే మీకు చాలా తొందరగా నడుము నొప్పి( Back Pain ) తగ్గిపోతుంది.

చాలా మంది డిప్రెషన్ కి( Depression ) గురవుతూ ఉంటారు.అటువంటి వాళ్ళు కూడా కంటిన్యూగా దానిమ్మ పండు తీసుకుంటే డిప్రెషన్ నుంచి మీకు చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది.ఎవరికైతే శరీరంలో రక్తం తక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళు క్రమం తప్పకుండా దానిమ్మ పండు జ్యూస్ కానీ, దానిమ్మ గింజలు కానీ తినడం చేస్తే బ్లడ్ త్వరగా పెరుగుతుంది.
అలాగే దానిమ్మ తీసుకోవడం వల్ల మనకు వచ్చే అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన విషయాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.దగ్గు సమస్య( Cough ) ఉన్నవారు దానిమ్మ అస్సలు తినకూడదు.
ఎందుకంటే దగ్గు, ఆస్తమా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు దానిమ్మ పండు తింటే వాళ్లకి అది ఇంకా రెట్టింపు అవుతుంది.

ఇంకా చెప్పాలంటే ఎసిడిటీ( Acidity ) ఉన్నవారు కూడా అసలు దానిమ్మ గింజలను తినకూడదు.ముఖ్యంగా ఎవరైతే లో బిపి బాధ పడుతున్నారో అటువంటి వాళ్ళు కూడా అస్సలు దీన్ని తీసుకోకూడదు.అలా తీసుకుంటే ఈ సమస్య ఇంకా పెరుగుతుంది.
ఈ పండు తొక్కలో ఎన్నో రకాల ఔషధా గుణాలు ఉంటాయి.వీటిని కూడా మన ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఔషధాలలో ఉపయోగిస్తూ ఉంటారు.
ఈ తొక్కలన్నీ శుభ్రంగా చేసుకొని ఎండబెట్టి పౌడర్ లా చేసుకుని దాన్ని మీరు ఫేస్ ప్యాక్ లా కూడా ఉపయోగించవచ్చు.ఈ విధంగా ఉపయోగిస్తే మీ చర్మం పై గ్లో పెరుగుతుంది.