ఒత్తిడిని క్ష‌ణాల్లోనే దూరం చేసే బ్లూబెర్రీస్.. ఆ బెనిఫిట్స్ కూడా?

ఒత్తిడి.ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ఈ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నారు.

అఫీస్‌లో అధిక ప‌ని, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ప‌రీక్ష‌ల్లో విఫ‌లం, ల‌వ్ ఫెల్యూర్ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఒత్తిడికి గుర‌వుతుంటారు.అయితే ఎంతటి బ‌ల‌వంతుడినైనా, ధ‌న‌వంతుడినైనా చిత్తు చేసే ఈ ఒత్తిడి నిర్ల‌క్ష్యం చేస్తే.

ప్రాణాంత‌కంగా కూడా మారిపోతుంది.అందుకే మొద‌టి స్టేజ్‌లో ఉన్న‌ప్పుడే ఒత్తిడిని దూరం చేసుకోవాలి.

అయితే ఒత్తిడిని దూరంలో కొన్ని ఆహారాలు అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.అలాంటి వాటిల్లో బ్లూబెర్రీస్ ముందుంటాయి.

Advertisement

విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబ‌ర్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటే బ్లూబెర్రీస్ ఆరోగ్య ప‌రంగా చేసే మేలు అంతా ఇంతా కాదు.ముఖ్యంగా ఒత్త‌డిగా ఉన్న స‌మ‌యంలో బ్లూబెర్రీస్‌ను పెరుగన్నంతో లేదా ఓట్స్‌తో కలిపి తిసుకోవాలి.

ఇలా చేస్తే.బ్లూబెర్రీస్‌లో అత్య‌ధికంగా ఉండే ఒత్తిడిని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

అంతేకాదు, మీ ఒత్త‌డిని దూరం చేసి, మూడ్‌ని స‌రి చేసే కెమికల్స్ మీ మెదడులో రిలీజ్ అయ్యేందుకు బ్లూబెర్రీస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.అందువ‌ల్ల‌, త‌ర‌చూ బ్లూబెర్రీస్ తీసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు.అలాగే బ్లూబెర్రీస్ తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ క‌రిగి.

మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.ఫ‌లితంగా గుండె సంబంధిత జ‌బ్బుల‌కు దూరంగా ఉండొవ‌చ్చు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

మ‌రియు ర‌క్త‌పోటు కూడా అదుపులో ఉంటుంది.ఇక క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క స‌మ‌స్య‌ను దూరం చేయ‌డంలోనూ, జ్ఞాప‌క శ‌క్తిని రెట్టింపు చేయ‌డంలోనూ, డ‌యాబెటిస్ వ‌చ్చే రిస్క్‌ను త‌గ్గించ‌డంలోనూ, చ‌ర్మ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలోనూ బ్లూబెర్రీస్ సూప‌ర్‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Advertisement

అంద‌వ‌ల్ల‌, ఒత్తిడి స‌మ‌స్య ఉన్న వారే కాదు.అంద‌రూ బ్లూబెర్రీస్‌ను త‌ర‌చూ తీసుకుంటే మంచిది.

తాజా వార్తలు