నందమూరి ఫ్యామిలీ లో ఎంతో మంది హీరోలు ఉన్నా అటు జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు.జూనియర్ తారక రాముడు సినిమా అంటే చాలు అటు అభిమానులు అందరూ కూడా విందు భోజనం ఆశిస్తూ ఉంటారు అనే చెప్పాలి.
ఇంతకీ విందు భోజనం అంటే ఏమిటి అంటే ఇందులో అన్ని రకాల వంటకాలు వుంటాయి.అలాగే ఎన్టీఆర్ నటించే ప్రతి సినిమాలో కూడా అన్నీ ఉంటాయి.
డాన్సులు నటన యాక్షన్ ఎమోషన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ చేసే సినిమాలో ఇది తక్కువైంది అని కానీ.ఇది లేదు అని కానీ ఒక ఆలోచన రాదు అనే చెప్పాలి.
ఇకపోతే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే.డాన్స్ మాస్టర్లు సైతం ఎన్టీఆర్ ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.సింగిల్ టేక్ లో ఎలాంటి స్టెప్ అయినా చేసేస్తాడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు.13 ఏళ్ల నుంచి కూచిపూడి నేర్చుకుని ఇప్పుడు డాన్స్ మీద ఆసక్తితో దుమ్ము రేపుతూ ఉంటాడు.కానీ ఒకానొక సమయంలో ఒక సాంగ్ లో డాన్స్ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ కాలు ఫ్రాక్చర్ అయిందట.ఆ సినిమా ఏదో కాదు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ.
ఈ సినిమాలో నాచోరే నాచోరే పాటకు ఎన్టీఆర్ చేసిన డాన్సులు ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదు అని చెప్పాలి. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేసారు.అయితే ఇక ఈ పాటలో ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన స్టెప్స్ కాస్త టప్ గా ఉండడంతో ఎన్టీఆర్ కాలికి ఫ్రాక్చర్ అయిందట.ఈ క్రమంలోనే గాయం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందట.
ఇక 40 రోజులు రెస్ట్ తీసుకొని మళ్లీ అదే స్టెప్ చేసి అదరగొట్టేశాడు ఎన్టీఆర్.ఈ విషయం తెలిసిన తర్వాత అందుకే ఎన్టీఆర్ ను బెస్ట్ డాన్సర్ అంటారేమో అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.