చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుతమైన పండ్లు ఇవే..!

చలికాలంలో రోగనిరోధక శక్తి ( Immunity )తగ్గడం వల్ల ఫ్లూ, జలుబు వంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.తాజా పండ్లను తీసుకోవడం వల్ల మీ శరీరం బలమైన రోగనిరోధక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుంది.

 These Are The Wonderful Fruits That Increase Immunity In Winter, Immunity , Ki-TeluguStop.com

ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.మరి ఆ అద్భుతమైన పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మన దేశంలో అనేక ప్రాంతాల్లో, చలి కాలంలో నారింజ సీజన్‌ ఉంటుంది.నారింజ మరియు ఇతర సిట్రస్ పండ్లను తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.

అధిక నీటిశాతం కారణంగా, నారింజ చలికాలంలో తాజాగా ఉంటుంది.

Telugu Dates, Fruits, Tips, Heart, Heart Problems, Immunity, Kiwi Fruits, Papaya

అలాగే దానిమ్మ సాధారణంగా చలికాలంలో అందుబాటులో ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే దానిమ్మ పండులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.శీతాకాలంలో జలుబు మరియు ఫ్లూ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఎంతో ముఖ్యం.

విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని దాదాపు చాలా మందికి తెలుసు.గుండె ఆరోగ్యం దానిమ్మతో ముడిపడి ఉంటుందనీ నిపుణులు చెబుతున్నారు.

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి రక్తపోటును తగ్గించడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

ముఖ్యంగా చెప్పాలంటే కివి, ఆపిల్ పండ్ల( Kiwi Fruits )ను చలికాలంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.

Telugu Dates, Fruits, Tips, Heart, Heart Problems, Immunity, Kiwi Fruits, Papaya

ఇంకా చెప్పాలంటే స్ట్రాబెర్రీ వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఈ పదార్థాలు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతాయి.ముఖ్యంగా చెప్పాలంటే విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.

అంతేకాకుండా చలికాలంలో వచ్చే వ్యాధులతో పోరాడటానికి శరీరానికి ఉపయోగపడుతుంది.చలి కాలంలో బొప్పాయి పండు( Papaya )ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బొప్పాయి లోని సహజ చక్కెరలు మీ శరీరానికి వేగంగా శక్తిని అందిస్తాయి.బొప్పాయిలో అధిక నీటి కంటెంట్ ఉండడం వల్ల ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇది రోగ నిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.అలాగే చలికాలంలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూరాలు కూడా క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube