టాలెంట్ అనేది ఒక వరం.టాలెంట్ కు చదువు తోడు అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది.
మన టాలీవుడ్ హీరోలకు నటనలో మంచి టాలెంట్ ఉంది.కానీ.
చదువుల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఇంతకూ మన హీరోల విద్యా అర్హతలు ఏంటో ఇప్పుడు చూద్దాం!
ఎన్టీఆర్:
ఈయన గుంటూరు ఏసీ కాలేజీలో బీఏ పూర్తి చేశారు.మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి సెలెక్ట్ అయ్యారు.
సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చింది.సినిమాల్లోకి రావడం కోసం ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఏఎన్నార్:

ఇతడు కేవలం మూడో తరగతి చదివారు.నాటకాలు, సినిమాలపై ఇష్టంతో చదువును పట్టించు కోలేదు.
కృష్ణ:

ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో బీఎస్పీ చదివారు.తర్వాత ఇంజినీరింగ్ చదవాలనుకున్నారు.కానీ సినిమాల్లోకి వచ్చారు.
శోభన్ బాబు:

ఈయన కూడా డిగ్రీ చదివారు.లా లో చేరి.మధ్యలో వదిలేశారు.
అనంతరం సినిమాల్లోకి వచ్చారు.
చిరంజీవి:

మెగాస్టార్ డిగ్రీ చదివారు.పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైఎన్ కాలేజీలో బీకాం పట్టా తీసుకున్నారు.
బాలకృష్ణ:

ఈయన కూడా డిగ్రీ చదివారు.హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకాం పూర్తి చేశారు.
వెంకటేష్:

ఈయన అమెరికాలో ఎంబీఏ చదివారు.తర్వాత ఇండియా కు తిరిగి వచ్చారు.సినిమా రంగంలోకి అడుగు పెట్టారు.
నాగార్జున:

అమెరికాలోని మిచిగాన్ వర్సిటీలో ఆటో మొబైల్ ఇంజినీరింగ్ లో ఎంఎస్ చేసారు.అనంతరం యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకొని.సినిమాల్లోకి వచ్చారు.
రాజశేఖర్:

ఈయన ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యారు.అనంతరం సినీ రంగంలోకి వచ్చారు.
పవన్ కళ్యాణ్:

ఈయన కేవలం ఇంటర్మీడియట్ చదివారు.తర్వాత సినిమా రంగంలోకి దిగారు.
మహేష్ బాబు:

మహేష్ మద్రాస్ లయోలా కాలేజీలో బీకాం చదివారు.తర్వాత సినిమాలు చేశారు.
ప్రభాస్:

హైదరాబాద్ లో బీటెక్ చదివి.పెదనాన్న కృష్ణం రాజు అండతో సినిమాల్లోకి వచ్చారు.
రానా:

చెన్నై ఫిల్మ్ స్కూల్ లో చదివారు.ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో బాచిలర్ డిగ్రీ చేశారు.
జూ.ఎన్టీఆర్:

ఈయన హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీలో ఇంటర్ చదివారు.అనంతరం సినిమాల్లోకి వచ్చారు.
అల్లు అర్జున్:

హైదరాబాద్ ఎమ్మెసార్ కాలేజీలో బీబీఏ చదివారు.
రామ్ చరణ్:

ఈయన ఇంటర్ మధ్యలోనే ఆపేశారు.
నాని:

సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో డిగ్రీ చదివారు.
రవితేజ:

విజయవాడ సిద్దార్థ కాలేజీలో బీఏ చదివారు.
విజయ్ దేవరకొండ:

హైదరాబాద్ బద్రుకా కాలేజీలో బీకాం చదివారు.
నాగ చైతన్య:

అక్కినేని హీరో బీకాం తో చదువు ఆపేశారు.
సాయి ధరమ్ తేజ్:

ఈయన బిఎస్సి బయోటెక్నాలజీ చదివారు.అనంతరం ఎంబీఏ పూర్తి చేశారు.
వీరితోపాటు చాలా మంది హీరోలు డిగ్రీలు పూర్తి చేశారు.