ఇప్పటికీ మిస్టరీగానే ..ఉన్నా తంజావూరు బృహదీశ్వరాలయం..?

మన భారతదేశం ఎన్నో పురాతన దేవాలయాలకు పెట్టింది పేరు.కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలు ఇప్పటికీ కూడా ఎంతో పదిలంగా ఉన్నాయి.

 Astrologer,brihadeeswara Temple,tamilnadu,గుడి శిఖరం,secret Of-TeluguStop.com

కానీ అటువంటి దేవాలయాలలో ఇప్పటికీ కూడా ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు నెలకొని ఉన్నాయి.ఈ తరహాలోనే తమిళనాడులో ఎంతో ప్రసిద్ధి చెందిన తంజావూరు బృహదీశ్వరాలయం కూడా ఒకటి.

ఈ ఆలయంలో ఇప్పటికీ కూడా ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి.అయితే ఈ ఆలయంలో ఉన్న రహస్యాలు ఏమిటి? ఈ ఆలయం ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

క్రీ.శ1010లో రాజరాజచోళుడు నిర్మించిన అతి పురాతనమైన బృహదీశ్వర ఆలయం తమిళనాడు లోని తంజావూరు లో ఉంది.ఈ ఆలయంలో ఆ పరమ శివుడు కొలువై ఉండి విశేష పూజలు అందుకుంటారు.

బృహదీశ్వరాలయాన్ని రాజరాజేశ్వరి ఆలయం అని కూడా పిలుస్తారు.ఈ ఆలయం చోళ సామ్రాజ్యం అనుగ్రహించడానికి రాజు చేత నది ఒడ్డున ఉన్న కోట లాగా నిర్మించబడినది.

ఇంతటి పురాతనమైన ఈ ఆలయంలో ఇప్పటికీ అంతు చిక్కని రహస్యాలు ఏర్పడి ఉన్నాయి.ఈ ఆలయ నిర్మాణం ఎంతో చాకచక్యంగా నిర్మించబడినది.సూర్యుడు గుడి శిఖరం పై ఉన్నప్పుడు ఆలయం నీడ భూమిపై పడదు.ఈ ఆలయ నిర్మాణ రహస్యం గురించి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేసిన సంఘటన ఇది.

అంతేకాకుండా ఈ ఆలయం లో మరొక వింతైన ఘటన ఒకటి ఉంది.ఈ సంఘటన ఆలయాన్ని సందర్శించే ఎటువంటి పర్యాటకులకు అయినా ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది.130,000 గ్రానైట్ ను ఉపయోగించి ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు.అయితే ఇప్పటికీ ఆ గ్రానైట్ ఎక్కడి నుంచి లభించిందో ఎవరికీ తెలియని రహస్యం.

ఇలా ఎన్నో రహస్యాలు దాగి ఉన్న ఈ ఆలయంలో శివుడు ప్రత్యేకమైన పూజలు అందుకుంటాడు.శివరాత్రి వంటి పర్వ దినాలలో పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube