మన దేశంలోని దాదాపు చాలామంది ప్రజలు ప్రతిరోజు ఆలయాలకు వెళ్లి భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు.అలాగే ఆలయాలకు వెళ్లలేని వారు ఇంట్లోనే తమ పూజ గది( Pooja room )లో భగవంతుని పూజిస్తూ ఉంటారు.
ఇలా పూజ చేసేటప్పుడు చాలా మంది తెలియక కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు.అయితే పూజ సమయంలో ఏలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
సనాతన ధర్మాన్ని అనుసరించి మనం భగవంతునికి పూజలు చేస్తూ ఉంటాము.భగవంతునికి నిత్యం పూజలు చేసే వారు కూడా ఉంటారు.
అయితే ఎక్కువగా ఏదైనా పెద్ద పూజ,వ్రతం లాంటివి చేయాల్సిన సమయం వచ్చినప్పుడు పవిత్రమైన తేదీ, సమయం చూసుకొని మరీ చేస్తూ ఉంటారు.

మంచి ముహూర్తం లో పూజ చేస్తే శుభ ఫలితాలు వస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.అయితే మంచి ముహూర్తం చూసుకోగానే సరిపోదు, మనం చేసే పూజా విధానం కూడా సరైన విధంగా ఉండాలని పండితులు చెబుతున్నారు చాలామందికి పూజలో కొన్ని చిన్న చిన్న ఆచారాలను పాటించడం తెలియదు.పూజా సమయంలో దేవునికి సమర్పించే నైవేద్యం చాలా శుభ్రంగా, స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలి.
నైవేద్యం( Naivedyam) ) ఎప్పుడూ సాత్విక ఆహారంగా ఉండాలి.అంతేకాకుండా దేవునికి నైవేద్యంగా పెట్టే ఆహారాన్ని తయారు చేసేటప్పుడు వంటగదిని పూర్తిగా శుభ్రంగా ఉంచాలి.

అలాగే మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోవాలి.మీరు పూజ కోసం ఆహారాన్ని సిద్ధం చేస్తుంటే ఎల్లప్పుడూ స్నానం చేసి, శుభ్రమైన దుస్తులను ధరించి స్వామికి నైవేద్యాన్ని సిద్ధం చేయాలి.అలాగే ఇనుము, స్టీల్, ప్లాస్టిక్ పాత్రలలో నైవేద్యం సమర్పించడం అంతా మంచిది కాదు.ప్రసాదం సమర్పించిన తర్వాత ఆలయం( temple )లో ఉంచకూడదు.ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది.ప్రసాదం సమర్పించిన తర్వాత దానిని కుటుంబ సభ్యులకు పంచాలి.
ప్రసాదం సమర్పించేటప్పుడు మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి.దీని వల్ల అదృష్టం, శ్రేయస్సు లభిస్తాయి.