వారాహి దేవి( Varahi Devi ) అంటే శ్రీమహావిష్ణువు అవతారం.అలాగే భైరవపత్ని.
అయితే ఇలాంటి వారాహి దేవిని స్తుతిస్తే.స్వరాభిష్టాలు కూడా చేకూరుతాయని మన ఉపాసకులు చెబుతున్నారు.
ఆమెను నిత్యం కొలిచే వారికి సర్వం సిద్ధిస్తుందని వారు తెలిపారు.అందుకే వారాహి దేవిని ఇంట్లో పూజిస్తే జీవితంలో ఎలాంటి లోటు కూడా ఉండదని వారు చెబుతున్నారు.
ఇక మరి ముఖ్యంగా అనారోగ్య, ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవాలనుకుంటే పారాహి దేవికి ఇలాంటి చిన్నపాటి పరిహారాలు చేస్తే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.వారాహి దేవీ ను ఏ రోజైనా కూడా పూజించవచ్చు.
అయితే ఈ పరిహారాన్ని ఏడు రోజులపాటు వరుసగా చేయవలసి ఉంటుంది.ఇలా చేస్తే నెరవేరని కోరుకంటూ ఉండడు.ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.వారాహి దేవిని స్తుతించి.
ఆరోజు ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకోవాలి.అలాగే పూజగదిని ( Pooja Room ) కూడా చాలా శుభ్రంగా చేసుకొని, పూజకు పుష్పాలు ( Pooja Flowers ) సిద్ధం చేసుకోవాలి.
ఆ తర్వాత సంధ్య పూజను ముగించుకోవాలి.ఇక తర్వాత రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ పరిహారాన్ని చేస్తూ ఉండాలి.
ఇక ఒక గాజు పాత్రలో గుప్పెడురాల్ల ఉప్పు, 9 మిరియాలను ఉంచాలి.
ఆ తర్వాత తొడిమ తీసిన తమలపాకులను కూడా ఉంచాలి.ఈ పాత్రను వారాహి దేవి ముందు ఉంచి, ఆమె ముందు స్వచ్ఛమైన నేతితో ప్రమీదంలో దీపం వెలిగించాలి.ఇలా ప్రతిరోజూ తరచూ రాత్రి 10 నుండి 11 గంటల వరకు నేతి తో దీపం వెలిగిస్తూ ఉండాలి.
ఇక ఉప్పును, మిరియాలను ఏడు రోజులకు వరకు కూడా మార్చాల్సిన అవసరం లేదు.అయితే తమలపాకు వాడిపోయే అవకాశం ఉండడం వలన తమలపాకులను తీసి తాజా తమలపాకులను ఉంచాలి.
ఆ ఆకులను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా చెట్ల వేరుల వద్ద వేయడం చేయాలి.ఇలా ఏడు రోజులపాటు చేస్తే తప్పకుండా భక్తులు కోరిన కోరికలను వారాహి దేవి నెరవేరుస్తుందని ఒక విశ్వాసం.అలాగే ఉప్పును, మిరియాలను ఏడు రోజులు పూర్తి అయ్యాక చెట్ల మొదట్లో వేసేయాలి.ఇలా ఏడు రోజులు వరకు చేస్తే, దీన్ని స్వచ్ఛమైన మనసుతో పాటిస్తే.
మీరు అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతాయి అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL