ప్రపంచంలో అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా..?

సాధారణంగా మనం ఏదైనా శివాలయాలకు వెళ్ళినప్పుడు మనకు ఎక్కువభాగం ఆ పరమ శివుడు లింగరూపంలోనే దర్శనమిస్తాడు.ఏవో కొన్ని ప్రాంతాలలో మినహా మిగతా అన్ని దేవాలయాలలో శివుడు లింగరూపంలోనే కొలువై ఉంటాడు.

 The Worlds Tallest Sivalingam Statue Located In Karnataka, Lard Shiva, Karnataka-TeluguStop.com

ఈ విధంగా ఒక్కో ఆలయంలో ఉన్న శివుడికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.కానీ ఇప్పుడు మనం ప్రపంచంలో కెల్లా ఎత్తైన శివుడి విగ్రహం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఎత్తయిన శివుడి విగ్రహం ఎక్కడ ఉంది? ఆ విగ్రహం విశిష్టత? ఆవిర్భావం ఏమిటి? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం….

కర్ణాటకలోని హోనావర్‌ పట్టణం దగ్గర్లో శ్రీ మురుడేశ్వర ఆలయం ఉంది.

ఈ ఆలయంలో ప్రపంచంలో కల్లా ఎంతో ఎత్తయిన శివుడి విగ్రహం మనకు దర్శనమిస్తుంది.ఇక్కడ 123 అడుగుల ఎత్తుగల శివుడి విగ్రహం మనకు కనబడుతుంది.

పురాణాల ప్రకారం రావణాసురుడు అత్యంత శివభక్తుడు అనే విషయం మనకు తెలిసిందే.ఆ విధంగా శివుడి పై ఉన్న భక్తితో శివుని కోసం తపస్సు చేసి శివుడి నుంచి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు.

కానీ శివుడు ప్రసాదించిన ఆత్మలింగం ఎలాంటి పరిస్థితులలో కూడా భూమిమీద పెట్టకూడదనే శరతుతో శివుడు ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇస్తాడు.

Telugu Atmalingam, Karnataka, Lard Shiva, Lingarupam, Ravanasurudu, Sivaratri, S

రావణాసురుడు ఈ శివలింగాన్ని తన భుజంపై పెట్టుకుని లంకకు బయలుదేరుతున్న సమయంలో మార్గమధ్యంలో సంధ్యాసమయం కావడంతో రావణాసురుడు సంధ్యావందనం చేయాల్సిన పరిస్థితులలో శివలింగాన్ని ఎక్కడ పెట్టాలో తెలియడం లేదు.అక్కడే ఉన్నటువంటి ఒక బాలుడిని పిలిచి తనకు సంధ్యావందన సమయం అయినదని అంతవరకు ఆత్మలింగాన్ని భూమిపై పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోమని ఆ బాలుడికి చెబుతాడు.అయితే బాలుడి రూపంలో ఉన్న వినాయకుడు కావలసిగానే శివలింగాన్ని భూమిపై పెడతాడు.

సంధ్యావందనం పూర్తిచేసుకుని వచ్చిన రావణాసురుడు భూమిపై ఉన్న శివలింగాన్ని పైకి ఎత్తాలని ఎంత ప్రయత్నించినప్పటికీ శివలింగం రాదు.ఈ క్రమంలోనే ఆ శివలింగంలో ఒక భాగం ఎగిరి దూరంగా పడిందని పురాణాలు చెబుతాయి.

ప్రస్తుతం ఉన్న ఆ ప్రాంతం మురుదేశ్వరాలయం అని చెబుతారు.ఈ ఆలయంలో ఉన్న స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.

శివరాత్రి వంటి మహా పర్వ దినాలలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube