స్పౌజ్ బదిలీలు చేపట్టాలంటు ఉపాద్యాయులు వారి పిల్లలతో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు.అమ్మ ఒక్క చోట,నాన్న ఒక చోట విధులు నిర్వహిస్తున్నారని, దీంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని చిన్నారులు ఆవేదన వ్యక్తంచేశారు.
వెంటనే ప్రభుత్వం స్పందించి స్పౌజ్ బదిలీలు చేపట్టి అమ్మ నాన్నలను ఒకటి చేయాలని కోరుతున్నారు.స్పౌజ్ బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉపాద్యాయులు వారి కుటుంబ సభ్యులతో కలిసి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు.
కలెక్టరేట్ ఎదుట తమ పిల్లలతో నిరసన తెలిపారు.
అమ్మా నాన్నలను కలపండి అంటూ చిన్నారులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.అనంతరం అధికారికి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా స్పౌజ్ ఫోరమ్ రాష్ట్ర కోకన్వీనర్ నరేష్ మాట్లాడుతూ.13 జిల్లాలో ఎస్జిటి, ఎల్పీ, పీఈటీ, మిగిలి పోయిన స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.ఇప్పటి వరకు మంత్రులను, ఎమ్మెల్యే లను అధికారులను కలిసిన తమసమస్యలు పరిష్కారం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
స్పౌజ్ బాధితులలో 80 శాతం మహిళా ఉపాధ్యాయులే ఉన్నారని, ప్రభుత్వానికి తమ గోడుని మొరపెట్టుకున్నారు.2100 స్పౌజ్ అప్పీల్లలో కేవలం 30% మంది దంపతులకే బదిలీలు చేపట్టి, పూర్తిగా అవకాశం ఉన్న క్యాడర్లను పక్కకు పెట్టడంతో, స్పౌజ్ బదిలీల కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు.ప్రతిరోజూ వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ, డ్యూటీలు చేస్తూ తమ కుటుంబానికి, పిల్లలకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోందని వాపోయారు.
ఎక్కువ మందికి 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు ఉన్నారని, ఇటు కుటుంబానికి అటు విద్య బోధనకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేక పోతున్నామని, తీవ్ర మానసిక వేదనకు లోనవుతున్నామని మహిళ ఉపాద్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి 13 జిల్లాలో ఎస్జిటి, ఎల్పీ, పీఈటీ, మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలు చేపట్టాలని వారు కోరారు.
ప్రభుత్వం స్పౌజ్ బదిలీలు చేపట్టని, లేనియెడల ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.