సినిమా రంగంలో వారసుల రాక కొత్తదేం కాదు.అలాగే ప్రస్తుతం సినిమా పరిశ్రమలో అన్నాచెల్లెల్ల హవా కొనసాగుతోంది.
ఇప్పటికే పలువురు అన్నయ్యలు హీరోలుగా రాణిస్తుండగా.వారికి సిస్టర్స్ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటున్నారు.
మహేశ్‌బాబు-మంజుల, రామ్ చరణ్-సుష్మిత, నితిన్-నిఖిత పలు సినిమాలను రూపొందించారు.అటు తాజాగా మరో ఇద్దరు హీరోల చెల్లెల్లు సినిమా మేకింగ్ లోకి అడుగు పెడుతున్నారు.
ప్రభాస్ సిస్టర్ ప్రసీధ, నాని చెల్లి దీప్తి కాంబినేషన్లో సినిమాలు వస్తున్నాయి.హీరోలుగా, నిర్మాతలుగా అన్నయ్యలు బిజీగా ఉంటే వారికి ఇబ్బందులు లేకుండా సెట్ లో పనులు చక్కబెడుతున్నారు ఈ చెల్లెల్లు.
నాని నిర్మాతగా చేస్తున్న తాజా మూవీ మీట్ క్యూట్.ఈ సినిమాకు దర్శకురాలుగా ఆయన చెల్లి దీప్తి పనిచేస్తున్నారు.ఇప్పటికే వాల్ పోస్టర్ సినిమా సంస్థను స్థాపించిన నాని, కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ వస్తున్నాడు.గతంలో ఓ షార్ట్ ఫిల్మ్ తీసిన అనుభవంతో దీప్తి ఈ సినిమాను తెరకెక్కిస్తుంది.
హీరోగా నాని బిజీ కావడంతో సెట్ లో దర్శకత్వంతో పాటు నిర్మాణ పనులను కూడా దీప్తి చక్కదిద్దనుంది.అటు నాని సిస్టర్ డైరెక్టర్ గా పరిచయం అవుతుంటే.
ప్రభాస్ సిస్టర్ ప్రసీధ నిర్మాతగా మారింది.ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ అనే సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా నిర్మాతల్లో ప్రభాస్ సోదరి ఒకరు.ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ప్రసీధ.
అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ పూర్తి చేసి.అక్కడ సినిమా పరిశ్రమలో కొంతకాలం పని చేశారు.
స్వదేశానికి తిరిగి వచ్చాక సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణా మూవీస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.నిర్మాణం, పబ్లిసిటీ మీద గట్టి పట్టున్న ఆమె.జాతిరత్నాలు పబ్లిసిటీలో ప్రసీధ కీ రోల్ ప్లే చేసింది.
అటు మంజుల, నిఖిత, సుష్మిత తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం ఉన్నవారే.కృష్ణ డాటర్ మంజుల నటిగా సినిమాల్లోకి వచ్చి.ఆ తర్వాత నిర్మాతగా మారింది.
అటు చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు.తమ్ముడు రాం చరణ్ ప్రొడ్యూసర్ కావడంతో నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వహించింది.
అటు నితిన్ సిస్టర్ నిఖితారెడ్డి నిర్మాణంలోకి అడుగు పెట్టారు.పలు సినిమాలను నిర్మించారు.
ప్రస్తుతం మాస్ట్రో మూవీని నిర్మిస్తుంది.