ఆ విషయంలో వేరే వాళ్ళపై ఆధారపడడం, నమ్మడం నాకు ఇష్టం లేదు: ఉపాసన

టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Mega Power Star Ram Charan )ఆయన సతీమణి ఉపాసన( upasana ) గురించి మనందరికీ తెలిసిందే.ఒకవైపు మెగా కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరొకవైపు అపోలో హాస్పిటల్స్ చైర్మన్గా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు ఉపాసన.

 Ram Charans Wife Upasana Comments On Financial Independence, Ram Charan, Upasana-TeluguStop.com

అలాగే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకూ తన కుటుంబానికి తన కూతురుకి భర్తకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇలా తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటుంది.

Telugu Ram Charan, Ramcharans, Tollywood, Upasana-Movie

ఇది ఇలా ఉంటే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కాగా అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సిరెడ్డి ( Dr.Pratap Sireddy )మనవరాలు అయిన ఉపాసన సుమారు రూ.77,000 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలిగా పేరొందిన సంగ‌తి తెలిసిందే.అయితే సంపద విషయంలో తన జీవితాన్ని పూర్తిగా స్వయం ఆధారంగా తీర్చిదిద్దుకోవాలని ఉపాసన నిర్ణయించుకున్నార‌ట‌.ఇదే విషయం గురించి ఉపాసన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.నేను ధనవంతుల కుటుంబంలో పుట్టానని అందరు భావిస్తారు.

Telugu Ram Charan, Ramcharans, Tollywood, Upasana-Movie

కానీ నా వ్యక్తిగత లక్ష్యాలను సాధించడానికి కావలసిన సంపద నాకిది కాదు.అందుకే నేను ఆర్థిక విషయాల్లో స్వయం నియంత్రణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను.సంపద విషయంలో వేరే వారిని నమ్మడం, వారిపైన ఆధారపడడం నాకు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చింది ఉపాసన.

ఆర్థిక పరిజ్ఞానం ప్రతి మహిళకు అవసరం.వారసత్వంగా సంపద వచ్చినా.

దాన్ని ఎలా నిర్వహించాలో తెలిసుండాలి.లేదంటే ఆ సంపదను సరిగ్గా ఉపయోగించలేరు అని ఉపాసన తెలిపింది.

ఇది ఇలా ఉంటే ఈ సందర్భంగా ఉపాసన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube