ఇటీవల రోజుల్లో చాలా మంది తక్కువ వయసులోనే తెల్ల జుట్టు( White Hair ) సమస్య బారిన పడుతున్నారు.ఇందుకు కారణాలు అనేకం ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కాలుష్యం, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.
దీని కారణంగా జుట్టు తెల్ల బడటం ప్రారంభమవుతుంది.దాంతో తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
కానీ జుట్టు తెల్లబడిన తర్వాత బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే వయసు పైబడిన సరే మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్,( Kallonji Seeds ) రెండు టేబుల్ స్పూన్లు ఎండిన ఉసిరికాయ ముక్కలు, రెండు రెబ్బల కరివేపాకు వేసి కనీసం ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి.

ఇలా వేయించుకున్న పదార్థాలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఈ పౌడర్ లో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్,( Coffee Powder ) రెండు టేబుల్ స్పూన్లు ఆవ నూనె, మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.