సంక్రాంతి పండుగప్పుడు హరిదాసులు ఎందుకు వస్తారు?

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు రంగవళ్లులు, పిండి వంటలు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగి రెద్దులు, కోడి పంద్యాలు, పతంగులు ఎగిరేస్తూ, బొమ్మరిల్లలో పాలు పొంగిస్తూ.ఇలా ఒక్కటేమిటి చెప్పలేనన్ని పనులతో ప్రజలంతా ఆనందంగా గడిపేస్తుంటారు.

 Why Do Come Hari Dases On Sankranthi, Hari Dases, Sankranthi, Traditions , Devo-TeluguStop.com

హరిదాసులు హరి కీర్తనలు చేస్తూ… ఇళ్ల ముందుకు వస్తుంటారు.అసలు వాళ్లెవరూ.

అలా ఎందుకు వస్తారు, దాని వెనుక ఉన్న ప్రాశస్త్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వివిధ రంగులతో అందమైన ముగ్గులు వేసి అందులో పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను పెట్టి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్ముడే హరిదాసు రూపంలో వస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

ఆయన తల మీద మంచి గుమ్మడి కాయ ఆకారంలో ఉన్న పాత్ర భూమికి సంకేతమట.అది ఆయన తలమీద ఉండటం వల్ల శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్ధరిస్తున్నాడని చెప్పడానికి సంకేతం అంట.

Telugu Devotional, Haridasulu, Sankranthi-Telugu Bhakthi

హరినామ కీర్తన చేస్తూ రావడం వెనుక తాను ఏ భోగాలకు లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడినని అర్థమట.తనకు తమ, పర భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికి తిరుకుగుతూ వస్తాడనే సంకేతం అని చెబుతుంటారు.అందుకే సంక్రాంతి పండుగప్పుడు హరిదాసులు కీర్తనలు చేసుకుంటూ ఇంటింటా తిరిగి ధాన్యాపు గింజలను అడక్కుంటూ ఉంటారు.ఇంటికి వచ్చిన హరిదాసులకు బియ్యమో, డబ్బులో ఇవ్వకుండా ఏ ఒక్కరూ వెనక్కి పంపించరు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ హరిదాసులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube