మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి రోజు ఇష్టదైవానికి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.ఈ తరుణంలోనే వారంలో ప్రతి రోజు ఇష్టదైవానికి ప్రత్యేక పూలతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగానే శనివారం అంటే సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వరస్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు అని చెప్పవచ్చు.శనివారం పెద్ద ఎత్తున భక్తులు స్వామి వారిని దర్శించుకొని కానుకలు సమర్పిస్తుంటారు.
అయితే శనివారం స్వామి వారికి ఏ విధమైన పువ్వులతో అలంకరిస్తారో ఇక్కడ తెలుసుకుందాం…
సాక్షాత్తు లక్ష్మి సమేతంగా కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామికి శనివారం జాజి పువ్వులు, తామర పువ్వులు, గులాబి పువ్వులతో పూజ చేయాలి.ఈ పువ్వులతో పూజ చేయటం వల్ల స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.
ఈ పుష్పాలతో శనివారం స్వామివారిని పూజించడం వల్ల నిత్యం సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు.అంతేకాకుండా శనివారం ఎర్రటి మందారాలను విష్ణు దేవుడికి సమర్పించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
అంతే కాకుండా శనివారం రోజున అచ్యుత అనే నామస్మరణ చేసుకోవడం వల్ల మనం తీసుకునే ఆహారం ఔషధంగా మారి ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

శనివారం నవగ్రహాలలో ఒకటైన శని గ్రహానికి ఎంతో ప్రీతికరమైనది.శనివారానికి శనీశ్వరుడు అధిపతి అని చెప్పవచ్చు.ఆ శనీశ్వరుని అనుగ్రహం కలిగి శని బాధలు తొలగిపోవాలంటే శనివారం రోజు శనీశ్వరునికి ఎంతో ఇష్టమైన నీలిరంగు పుష్పాలతో పూజించడం వల్ల ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న శనిదోషం తొలగిపోతుంది.
అంతేకాకుండా శనివారం వెంకటేశ్వర స్వామి సన్నిధి నందు, నవగ్రహాలు ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయి.శనివారం పూట “గోవిందా”అనే నామస్మరణం చేయడం వల్ల సకల సంపదలతో మన ఇల్లు నిత్యం కళకళలాడుతుంటుందని వేద పండితులు తెలియజేస్తున్నారు.