మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనకు ముప్పై కోట్ల మంది దేవతలు ఉన్నారు.అయితే చాలా మంది దేవతలు మనకు తెలియక పోయినప్పటికీ.
ప్రసిద్ధి గాంచిన పలువురు గురించి మాత్రం మనకు చాలా బాగా తెలుసు.అంతే కాదు మనకు వీలున్నప్పుడల్లా మనకు నచ్చిన దేవుడో లేదా ఇంటి దేవుడికో ప్రత్యేక పూజలు, వ్రతాలు కూడా చేస్తుంటాం.
కోరిన కోరికలు తీరిస్తే.ఆయా దేవుళ్లకు నచ్చిన ప్రసాదాలు, వస్తువులను సమర్పిస్తుంటాం.
అయితే ఇంత మంది దేవుళ్లలో మనకు త్రిమూర్తులు తెలుసు.శివుడు, బ్రహ్మ, విష్ణువులు.
కానీ పంచ మూర్తులు ఎవరనే విషయం మాత్రం మనకు తెలియదు.చాలా మంది బ్రహ్మ, శివుడు, విష్ణువులతో పాటు మరో ఇద్దరు దేవుళ్లనే పంచ మూర్తులు అని కూడా అనుకుంటారు.
అయితే ఇది నిజం కాదు.త్రిమూర్తులకు, పంచ మూర్తులకు ఎటువంటీ సంబంధమూ లేదు.
అయితే ఆ పంచ మూర్తులు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పంచ మూర్తుల్లో మొదటి వాడు.
విఘ్నాలను తొలగించే వినాయకుడు.రెండోది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి.
మూడోది శ్రీ పరమ శివుడు.నాలుగోది శ్రీ పార్వతీ దేవి.అయిదవది శ్రీ చండి కేశ్వరుడు.వీరినే పంచ మూర్తులు అని పిలుస్తారు.
అలాగే పంచ మూర్తులకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు.అలాగే త్రిమూర్తులనే పంచ మూర్తులనే వారికి.
పంచ మూర్తుల గురించి తెలపండి.