హోలీ రోజున ఈ వస్తువులను కొంటే.. అదృష్టం మిమ్మల్ని వదిలి వెళ్ళదు..

ఒక వ్యక్తి అన్ని బాధలు, రోగాలు, బాధల నుంచి ఉపశమనం పొందాలంటే హోలీ పండుగ రోజు ఈ వస్తువులను కొనుగోలు చేయడం మంచిది.హోలీ పండుగ ను దేశవ్యాప్తంగా ప్రజలందరూ మార్చి 8వ తేదీన జరుపుకుంటారు.

 Buy These Things On Holi Pournami For Getting Good Luck Details, Things ,holi P-TeluguStop.com

హోలీ పండుగ కోసం చాలామంది ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.ఒకరినొకరు రంగులు పూసుకుంటూ ప్రజలు తమ కష్టాలన్నీ మర్చిపోయి హోలీ రంగులో సంతోషంగా ఉంటారు.

హోళికా దహనంతో చెడును, స్వార్ధాన్ని, కాల్చివేసి మంచి వైపు అడుగులు వేసే రంగుల పండుగ హోలీ పండుగ.హోలీ పౌర్ణమి రోజున ఇంట్లోకి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

ఇంట్లో సంపదకు అసలు లోటు ఉండదు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ పౌర్ణమి రోజు వెండి నాణెం, వెండి చిన్నపెట్టే కొనడం మంచిది.

తర్వాత పసుపునీ పసుపు రంగు గుడ్డలో కట్టి లక్ష్మీదేవి విగ్రహం పక్కన పెట్టాలి.హోలీ పౌర్ణమి రోజు హోలికను కాల్చిన తర్వాత లభించే బూడిదను మీరు కొన్న వెండి పెట్టలో వేసి అల్మారాలో ఉంచాలి.హోలీ పౌర్ణమి రోజు ఈ పద్ధతిని అనుసరించడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.వెండి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.వెండిని ధరించడం వల్ల మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి.చిన్న పిల్లలకు వెండి కంకణాలు ధరించడం వల్ల, వారి కండరాలను బలోపేతం చేస్తాయి.

హోలీ పౌర్ణమి రోజున వెండి ఉంగరాన్ని కొని పూజించాలి.పూజించిన ఉంగరాన్ని ప్రసాదంగా స్వీకరించి ధరించడం వల్ల అదృష్టం ఎప్పుడు మీ వెంటే ఉంటుంది.వెండి పట్టీలు శాస్త్రోక్తంగా కూడా మహిళలకు క్రెడిట్ ఇస్తుంది.హోలీ పౌర్ణమి రోజున వెండి పట్టిలు కొనుగోలు చేసిన తర్వాత పాలతో కడగాలి.అప్పుడు మీరు దానిని స్నేహితులకు ఇవ్వవచ్చు లేదా మీరే ధరించవచ్చు.హోలీ పౌర్ణమి రోజు వెండి పట్టిలు ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకు ఎప్పుడూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube