1.ఎమ్మెల్యే అనిల్ కుమార్ పై మేకపాటి విమర్శలు
మాజీ మంత్రి వైసిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్( Anil Kumar ) పై వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేశారు.నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా విమర్శలు చేయవద్దంటూ అనిల్ కుమార్ ను హెచ్చరించారు.
2.సోనియా పై బిజెపి ఎంపి అరవింద్ కామెంట్స్
కాంగ్రెస్ కీలక నాయకురాలు సోనియాగాంధీపై నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి విమర్శలు చేశారు .మా నాన్న ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్యానికి గురైనప్పుడు సోనియాగాంధీ కనీసం ఫోన్ కూడా చేయలేదని విమర్శించారు.
3.రాహుల్ గాంధీ భద్రతపై సమీక్ష
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భద్రతపై కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సమీక్ష చేసేందుకు సిద్ధమవుతోంది.
4.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.మంగళవారం టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
5.రజకులకు ఎస్సీ హోదా కల్పించాలి
దేశంలోని 11 రాష్ట్రాల్లో రజకులకు ఎస్సీ హోదా కల్పించాలని నేషనల్ ధోబి మహాసంగ్ డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది.
6.తెలంగాణలో టీడీపీ కి పునర్వైభవం
తెలంగాణలో టిడిపికి పునర్ వైభవం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ధీమా వ్యక్తం చేశారు.
7.ఆర్ ఆర్ ఆర్ సర్వే ను అడ్డుకున్న రైతులు
అలైన్మెంట్ ను మార్చాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం గ్రామ రైతులు అధికారులను అడ్డుకున్నారు.
8.ఉద్ధవ్ థాక్రే, సంజయ్ రౌత్ కు హై కోర్టు సమన్లు
పరువు నష్టం కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే , ఆదిత్య థాకరే , సంజయ్ రౌత్ లకు ఢిల్లీ హై కోర్టు సమన్లు జారీ చేసింది.
9.పాన్ ఆధార్ లింక్ గడువు పెంపు
కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ ను పొడిగించింది.జూన్ 30 వరకు అవకాశం కల్పించింది.
10.ఒంటి పూట బడులపై టిడిపి ప్రశ్న
ఏపీలో ఒంటిపూట బడులు ఇంకెప్పుడు జగన్ అని టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.
11.ఆర్ఆర్ఆర్ టీం కు చిరంజీవి సన్మానం
ఆర్ఆర్ ఆర్ టీం కు మెగాస్టార్ చిరంజీవి సన్మానం నిర్వహించారు.రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా నిన్న రాత్రి జరిగిన స్పెషల్ పార్టీలో చిత్ర యూనిట్ ను చిరంజీవి సన్మానించారు.
12.కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
తాను ఇంటర్మీడియట్ గుంటూరులో చదువుకున్నానని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
13.హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణం శాఖ హెచ్చరించింది .ఈ వారంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కు పెరిగే అవకాశం ఉన్నందున హైదరాబాద్ లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
14.నిమ్స్ కు ఎర్ర మంజిల్ స్థలం
పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఎర్రమంజిల్ స్థలం మొత్తాన్ని నిమ్స్ కు ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
15.ఎంపీ బంగ్లాను ఖాళీ చేస్తా : రాహుల్
అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ఎంపీ బంగ్లాను ఖాళీ చేస్తానని ప్రకటించారు.
16.ఢిల్లీకి ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్నారు.
17.కిషన్ రెడ్డి కామెంట్స్
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీకి వెళ్లి మహిళా రిజర్వేషన్ బిల్లు పై పోరాటం ఏమిటని , మీకు ఏ అధికారం ఉందంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి విమర్శలు చేశారు.
18.గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టు స్టేటస్ కో
గుంటూరులో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.గ్రానైట్ తవ్వకాలపై స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది.
19.టిడిపి జనసేన తో కలిసి పోటీ చేస్తాం
రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలతో కలిసి సిపిఐ ఎన్నికలకు వెళ్తుందని, ముఖ్యంగా జనసేన, టిడిపి పార్టీలతో కలిసి పోటీ చేయబోతున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 54,500
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 59,450
.