ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్( Singer Udit Narayan ) ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారారు.ఆయన చేసిన ఒక పని ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.
లైవ్ కాన్సర్ట్‌లో( Live Concert ) పాట పాడుతూ ఉండగా, అభిమానులకి ముద్దులు పెట్టారు ఉదిత్.దీంతో జనాలు ఒక్కసారిగా షాకయ్యారు.“టిప్ టిప్ బర్సా పానీ” పాట పాడుతుండగా ఒక లేడీ ఫ్యాన్ సెల్ఫీ కోసం స్టేజ్ దగ్గరికి వచ్చింది.సెల్ఫీ తీసుకున్నాక ఆ అమ్మాయి ఉదిత్ బుగ్గపై ముద్దు పెట్టింది.
అంతే, ఉదిత్ వెంటనే ఆమెను పట్టుకుని లిప్ కిస్( Lip Kiss ) ఇచ్చేశాడు.ఇది చూసిన జనాలు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఇది నిజంగా జరిగిందా? లేక ఎవరైనా AI టెక్నాలజీతో ఫేక్ వీడియో చేశారా? అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది నెటిజన్లు అయితే ఉదిత్ నారాయణ్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.“ఇది AI వీడియో అని చెప్పండి ప్లీజ్, ఇది కలలో కూడా ఊహించలేని దారుణం,” అని ఒకరు కామెంట్ చేశారు.మరొకరు, “ఆయన స్థాయి సింగర్ ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు” అని అన్నారు.
ఇంకొందరు అయితే, “ఈ ఒక్క సంఘటనతో ఆయన పేరు మొత్తం పోతుంది” అని బాధపడుతున్నారు.
ఇది ఒక్కటే కాదు, ఆ కాన్సర్ట్ లో ఉదిత్ చాలా మంది అభిమానులకు లిప్‌కిస్సులు ఇచ్చారట.దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్( Viral Video ) అవుతున్నాయి.ఈ వివాదం పెద్దదవడంతో ఉదిత్ నారాయణ్ ఒక ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు.“ఫ్యాన్స్ పిచ్చివాళ్లు.మేం మంచివాళ్లం, అభిమానులు వాళ్ల ప్రేమను ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తారు.
దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ చాలామంది ఉన్నారు, బాడీగార్డ్స్ కూడా ఉన్నారు.కొందరు అభిమానులు షేక్ హ్యాండ్ ఇస్తారు, కొందరు చేతిని ముద్దు పెట్టుకుంటారు.
అదంతా వాళ్ల ఎక్సైట్‌మెంట్‌లో భాగం.దాన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దు,” అని అన్నారు.
అంతేకాదు, కావాలనే కొందరు తనను వివాదంలోకి లాగాలని చూస్తున్నారని కూడా ఆయన అన్నారు.“మా అబ్బాయి ఆదిత్య ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు.అది కొందరికి నచ్చకపోవచ్చు.నేను పాటలు పాడుతుంటే అభిమానులు ప్రేమ చూపిస్తారు, వాళ్లని సంతోషంగా ఉండనివ్వండి.నేను తప్పుగా ప్రవర్తించే మనిషిని కాదు,” అని ఉదిత్ క్లారిటీ ఇచ్చారు.“అది సడన్‌గా జరిగిపోయింది.నేను 46 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను.నా ఇమేజ్ ఎప్పుడూ ఇలా లేదు.అభిమానులు ప్రేమ చూపిస్తే నేను చేతులు జోడించి రెస్పెక్ట్ చూపిస్తాను.మళ్లీ ఇలాంటి మూమెంట్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు?” అని కూడా ఆయన అన్నారు.ఎక్కడ, ఎప్పుడు ఈ సంఘటన జరిగిందో మాత్రం ఉదిత్ చెప్పలేదు కానీ, ఇది పెద్ద విషయం కాదని, సీరియస్‌గా తీసుకోవద్దని ఆయన తేల్చి చెప్పారు.