సాధారణంగా ఉగాది పండగకు షడ్రుచులు రుచి చూస్తాం.కానీ ఈ సారి అంతకన్నా ముందే సంక్రాంతికి( Sankranthi ) రుచి చూపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి.
అదిరిపోతుంది కదా.అసలు విషయం ఏమిటి అంటే ఈ సారి సంక్రాంతి కి అరడజన్ కి పైగా సినిమాలను లైన్ లో పెట్టారు మేకర్స్.అయితే ఒక్కో సినిమా ఒక్కో జోనర్ లో తెరకెక్కుతూ ఫాన్స్ కి పిచ్చెక్కిస్తున్నారు.ఇంతకు సంక్రాంతి కి వస్తున్న సినిమాలు ఏంటి ? వాటి జోనర్స్ ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
సంక్రాంతికి బోలెడన్ని సినిమాలు వస్తున్నాయి.ఇందులో ఏ ఒక్క సినిమాకు మరొక సినిమాతో సంబంధం లేదు.
అన్ని కూడా భిన్నమైన జోనర్ కంటెంట్ తో వస్తున్నాయి.అందులో బాగా హైప్ ఉన్న సినిమా గుంటూరు కారం.
( Guntur Karam Movie ) ఈ సినిమా యాక్షన్ మరియు హ్యూమన్ ఫాంటసీ గా తెరకెక్కుతుంది.బోలెడన్ని కమర్షియల్ హంగులు, మాస్ మాసాలతో వస్తున్న ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఫుల్ క్రేజ్ గా ఎదురు చూస్తున్నారు.
ఈసారి కూడా విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) కూల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాయి.ఖుషి సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు.ఇక హాలీవుడ్ రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తో వస్తున్నాడు మాస్ రాజా రవి తేజ. ఈయన సంక్రాంతి బరిలో ఈగల్ సినిమాను( Eagle Movie ) సెట్ చేసుకున్నాడు.సంక్రాంతి అంటే రవి తేజకు చాల స్పెషల్.ఈ సారి ఎలాగైనా బంపర్ హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు.
పూర్తి స్థాయి ఫిక్షన్ డ్రామా సినిమా గా తెరకెక్కుతున్న హనుమాన్( HanuMan ) సైతం ఈ సంక్రాంతి బరిలో ఉంది.ఈ సినిమాకు తేజ సజ్జ హీరోగా నటించగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కుతుంది.ఇక నాగార్జున సైతం నా సామీ రంగా( Na Saami Ranga ) అంటూ సంక్రాంతికే వచ్చేస్తున్నాడు.ఫుల్ మాస్ జోనర్ లో ఇది తెరకెక్కుతుంది.ఇక శివ కార్తికేయన్ ఫుల్ స్సైన్స్ ఫిక్షన్ డ్రామా జోనర్ లో నటించిన చిత్రం ఐరా.వీటితో పాటు రజినీకాంత్ గెస్ట్ రోల్ లో కనిపించిన స్పోర్ట్స్ డ్రామా లాల్ సలాం కూడా సంక్రాంతికే వస్తుంది.