ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.49
సూర్యాస్తమయం: సాయంత్రం.6.12
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: ఉ.చవితి మంచిది కాదు.
దుర్ముహూర్తం: సా.4.25 ల5.13
మేషం:

ఈరోజు ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి.
వృషభం:

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.నూతన రుణయత్నాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నయి.
వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.కొన్ని ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో పూర్తి అవుతాయి.ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
మిథునం:

ఈరోజు స్థిరస్తి కొనుగోలు చేస్తారు.సోదరుల కలయిక ఆనందం కలిగిస్తుంది.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి.
వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
కర్కాటకం:

ఈరోజు బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు.వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు.ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.నిరుద్యోగ ప్రయత్నలలో అవరోధాలు కలుగుతాయి.
సింహం:

ఈరోజు ఉద్యోగులకు అధికారుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.బంధు మిత్రులతో ఉన్న సమస్యలు తొలగుతాయి.వృత్తి, వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.ఇతరులకు ధన సహాయం అందిస్తారు.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
కన్య:

ఈరోజు వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు.వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
తుల:

ఈరోజు వ్యాపారాలలో ఆశించిన అభివృద్ది సాధిస్తారు.నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు.బంధుమిత్రులతో కలసి విహారయాత్రలలో పాల్గొంటారు.సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి.
వృశ్చికం:

ఈరోజు చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు.మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు.వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.
ఋణ ఒత్తిడి పెరుగుతుంది.ఇంటా బయట బాధ్యతలు కొంత చికాకు కలిగిస్తాయి.ప్రయాణాలలో కొంత లాభం ఉన్నప్పటికీ శారీరక శ్రమ తప్పదు.
ధనుస్సు:

ఈరోజు మిత్రులకు మీ అభిప్రాయాలు నచ్చే విధంగా ఉండవు.అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు.కుటుంబ పెద్దలతో మాటపట్టింపులుంటాయి.ఇంటా బయట ఒత్తిడి వలన శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
మకరం:

ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.
కుంభం:

ఈరోజు చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.బంధు మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి.కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
మీనం:

ఈరోజు ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.బంధు, మిత్రులతో విభేదాలు కలుగుతాయి.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి.వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి.