నవజాత శిశువు బరువు పెరగాలంటే ఈ నియమాలను పాటించండి..!

ముఖ్యంగా చెప్పాలంటే గర్భిణీ మహిళలు( Pregnant women ) ఎంతో జాగ్రత్తగా ఉండాలి.అలాగే ఆహారం విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి.

 Follow These Rules To Increase Weight Of Newborn Baby , Newborn Baby, Increase-TeluguStop.com

ఏ సమయంలో ఏది తినవచ్చు.ఏది తినకూడదో కచ్చితంగా తెలుసుకుని ఉండాలి.

అప్పుడే కడుపులో బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటుంది.లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ( World Health Organization ) సూచన ప్రకారం గర్భం దాల్చే సమయానికి మహిళా కనీసం బీఎంఐ 18.5 కేజీ/మీ.స్క్వేర్ గా ఉండాలి.అది తక్కువ బరువు లేదా అధిక బరువు వల్ల పిండం ఎదుగుదల, కాన్పు వంటి విషయాల్లో అనుకొని ప్రమాదాలు ఎదురవుతాయి.

Telugu Breast Milk, Diabetes, Newborn Baby, Pregnant, Tips-Telugu Health Tips

అందుకే ఇలాంటి విషయాల పై ప్రతి మహిళకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి.చిన్న పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఈ క్రింది జాగ్రత్తలను కచ్చితంగా పాటించండి.ముఖ్యంగా చెప్పాలంటే అప్పుడే పుట్టిన పిల్లలు చాలా కోమలంగా ఉంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.బిడ్డ పుట్టిన మొదటి 28 రోజులు చాలా కష్టమైన సమయం అని చెప్పవచ్చు.

ఈ సమయంలో వాళ్లను కంటికి రెప్పల కాపాడితేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.తాజా నివేదిక నివేదికల ప్రకారం ఈ సమయంలో నిర్లక్ష్యం మూలంగా ప్రతి సంవత్సరానికి మొదటి 28 రోజుల్లో 2.6 మిలియన్ల పిల్లలు మరణిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

Telugu Breast Milk, Diabetes, Newborn Baby, Pregnant, Tips-Telugu Health Tips

ఇంకా చెప్పాలంటే బిడ్డకు పాలు ఇచ్చే తల్లి కూడా బలమైన ఆహారం తీసుకోవాలి.ఆమె ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉన్నప్పుడే బిడ్డకు సరైన పాలు ఇవ్వగలదు.అందువల్ల తల్లి పోషక ఆహారం తీసుకుంటూ ఉండాలి.

అలాగే నవజాత శిశువుకు తల్లిపాలు( breast milk ) ఎంతో ముఖ్యం.వీటిలో పిల్లలకు కావలసిన పోషకాలు, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి.

తల్లిపాలు తాగితే పిల్లలు ఎంత బరువు ఉండాలో అంతే ఉంటారు.అధిక బరువు, బరువు లేకపోవడం వంటి సమస్యలు కనిపించవు.

తల్లిపాలు తాగుతూ పెరిగే పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్, ఒబెసిటీ సమస్యలు( Diabetes ,obesity problems ) రాకుండా ఉంటాయి.అలాగే పిల్లలకు తల్లి స్పర్శ ఎంతో ముఖ్యం.

సాధారణంగా ఉష్ణోగ్రతలలో మార్పు వచ్చినప్పుడు తల్లి స్పర్శ పిల్లల శరీరంలోని ప్రధాన ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube