హెయిర్ బ్రేకేజ్( Hair Breakage ) అనేది చాలా మంది ఆడవారిని కలవరపెట్టే కామన్ సమస్య.జుట్టు విరిగిపోవడం, చిట్లిపోవడం వల్ల తీవ్రమైన అసహనానికి లోనవుతుంటారు.
ఎలా ఈ సమస్యను అడ్డుకోవాలో తెలియక మదన పడుతుంటారు.అయితే హెయిర్ బ్రేకేజ్ కు చెక్ పెట్టే టిప్స్ అండ్ ట్రిక్స్ కొన్ని ఉన్నాయి.
అవేంటో తెలుసుకుందాం పదండి.
హెయిర్ బ్రేకేజ్ కు ముఖ్య కారణాల్లో పోషకాహార లోపం( Malnutrition ) ఒకటి.
అందువల్ల ప్రోటీన్, బయోటిన్, ఐరన్, ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.ఆకుకూరలు, గుడ్లు, చేపలు, బాదం, వాల్ నట్స్ వంటి ఆహారాల తద్వారా ఆయా పోషకాలను పొందవచ్చు.
హెయిర్ బ్రేకేజ్ కు చెక్ పెట్టాలని భావించేవారు సల్ఫేట్-ఫ్రీ, కెరటిన్-బేస్డ్ షాంపూలు ఉపయోగించండి.హెయిర్ వాష్ తర్వాత కండీషనర్ అప్లై చేయడం అస్సలు మరచిపోవద్దు.
అలాగే వేడి వేడి నీటితో తలస్నానం చేయడం, రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేసుకోవడం, స్ట్రెయిటనర్లు, కర్లింగ్ ఐరన్లు, బ్లో డ్రయ్యర్ అధికంగా ఉపయోగించడం, తడి జుట్టును దువ్వడం వంటి అలవాట్లు ఉంటే వదులుకోండి.

వారానికి కనీసం రెండు నుంచి మూడు సార్లు కొబ్బరి నూనె,( Coconut Oil ) బాదం నూనె లేదా క్యాస్టర్ ఆయిల్ ను తలకు పట్టించి మసాజ్ చేసుకోండి.తద్వారా రక్తప్రసరణ మెరుగై జుట్టు బలపడుతుంది.హెయిర్ బ్రేకేజ్ తగ్గుతుంది.
అధిక ఒత్తిడితో హెయిర్ ఫాల్,( Hair Fall ) బ్రేకేజ్ పెరిగే అవకాశం ఉంటుంది.అందువల్ల ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉండండి.అందుకోసం యోగా, మెడిటేషన్ చేయండి.

ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే ఎగ్ మాస్క్ హెయిర్ బ్రేకేజ్ కు అడ్డకట్ట వేస్తుంది.అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో రెండు ఎగ్ వైట్స్ మరియు రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకసారి ఈ మాస్క్ వేసుకుంటే జుట్టు దృఢంగా మారి విరగడం, చిట్లడం తగ్గుముఖం పడతాయి.







