పాకిస్థాన్ మాజీ గ్రేట్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్( Shoaib Akhtar ) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే.తన ఫోటోలు, వీడియోలను రెగ్యులర్‌గా షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటారు.
తాజాగా, అక్తర్ ను భారతదేశానికి చెందిన ప్రముఖ సోషల్ మీడియా స్టార్ డాలీ చాయ్ వాలా( Doli Chai Wala ) కలిశారు.ఈ భేటీకి సంబంధించిన వీడియోను షోయబ్ అక్తర్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్ T20( International League T20 ) వ్యాఖ్యతగా ఉన్న అక్తర్ UAE లో ఉంటున్నారు.అదే సమయంలో, డాలీ చాయ్ వాలా తన ప్రసిద్ధ టీ ను అక్తర్‌తో పాటు మాజీ భారత క్రికెటర్ సబా కరీమ్ కి అందించాడు.
వైరల్ అయిన వీడియోలో( Viral Video ) అక్తర్ తన అభిమానులకు డాలీని పరిచయం చేశారు.ఆసక్తికరంగా, అక్తర్ “నా మ్యాచ్‌లు చూశావా?” అని డాలీని ప్రశ్నించారు.దీనికి “పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ల చాలా మ్యాచ్‌లను చూశాను” అని డాలీ సమాధానమిచ్చారు.అలా మాట్లాడుతున్నపుడు అక్తర్, “సచిన్ టెండూల్కర్‌ను( Sachin Tendulkar ) పాకిస్తాన్ బౌలర్లు అవుట్ చేసినప్పుడు ఎలా అనిపించేది?” అని ప్రశ్నించగా, డాలీ క్రేజీ ఆన్సర్ ఇచ్చాడు.“మీ మ్యాచ్‌లు చాలా చూశాను.మీరు గొప్ప బౌలర్.
మీరు బ్యాట్స్‌మెన్‌కి బౌలింగ్ చేస్తున్నట్లు ఎప్పుడూ అనిపించలేదు.ఎప్పుడూ బంతిని విసిరి కొట్టినట్లు అనిపించేది!” అంటూ చెప్పి అందరినీ ఆకట్టుకున్నాడు.
ఆ తరువాత అక్తర్ డాలీ చేసిన టీని కూడా ప్రశంసించారు.
షోయబ్ అక్తర్ తన క్రికెట్ కెరీర్‌లో 46 టెస్టు మ్యాచ్‌లు ఆడి 82 ఇన్నింగ్స్‌లలో సగటు 25.69, ఎకానమీ 3.37 తో 178 వికెట్లు తీశాడు.11/78 టెస్టుల్లో అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.12 సార్లు 5 వికెట్లు, 2 సార్లు 10 వికెట్లు తీశారు.మరోవైపు వన్డే ఫార్మాట్‌లో 163 వన్డే మ్యాచ్‌లు ఆడి 162 ఇన్నింగ్స్‌లలో సగటు 24.97, ఎకానమీ 4.76 లతో 247 వికెట్లు తీశాడు.అక్తర్ మైలేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రపంచంలోనే వేగంగా బౌలింగ్ వేసిన బౌలర్ అనే రికార్డును ఇప్పటికీ తన పేరుతోనే కొనసాగిస్తున్నాడు.అక్తర్ – డాలీ చాయ్ వాలా భేటీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డాలీ మాటలు క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడమే కాకుండా, అక్తర్ ఫ్యాన్స్‌ను కూడా ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి.