1.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 12,249 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
2.కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ
రాష్ట్రంలో హోంగార్డులు, మోడల్ స్కూళ్ల సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
3.కెసిఆర్ కుటుంబం పై సిబిఐకి ఫిర్యాదు

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీబీఐకి ఫిర్యాదు చేశారు.
4.ఆత్మకూరు ఉప ఎన్నికకు పటిష్ట భద్రత

ఆత్మకూరు ఉప ఎన్నికకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు.
5.ఇద్దరు వైసిపి కార్పొరేటర్ల పై కేసు
ఏలూరులో ఇద్దరు వైసీపీ కార్పొరేటర్ల పై కేసు నమోదైంది.నగరంలోని చాటపర్రు రోడ్డు లో భూకబ్జా దారం రాజేంద్రనాథ్ అనే వ్యక్తి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదయింది.
6.ప్రభుత్వ పథకాల పురోగతిపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల పురోగతిపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు.
7.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో పదిమంది వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల అరెస్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో పదిమంది వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
8.కార్మికుల వేతనాలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం : సీ.కళ్యాణ్

వేతనాల పెంపు పనిదినాల్లో మార్పులు కోరుతూ సినీ కార్మికులు చేపట్టిన నిర్మాతల మండలి స్పందించింది.కార్మికుల వేతనాలు పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.
9.ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల
ఏపీలో ఇంటర్ పరీక్ష ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.
10.సంగారెడ్డి జిల్లాలో కేటీఆర్ పర్యటన

నేడు తెలంగాణ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు జిల్లాలోని జహీరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
11.శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టించిన ఎలుగుబంటి మృతి
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం లో ప్రజలపై దాడి చేసిన ఎలుగుబంటి చనిపోయింది.
12.అమెరికాలో నల్గొండ వాసి కాల్చివేత

నల్గొండ కు చెందిన నక్క సాయి కుమార్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి అమెరికాలో కాల్చివేతకు గురయ్యాడు.కారులో నక్క సాయికుమార్ వెళుతుండగా నల్లజాతీయులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
13.ఎమ్మెల్యే వంశీ అస్వస్థత

గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు పంజాబ్ లోని మొహాలీలోనీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
14.ఏపీలో భారీ సిమెంట్ ప్లాంట్
పల్నాడు జిల్లాలో భారీ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుచేసిన శ్రీ సిమెంట్ సంసిద్ధత వ్యక్తం చేసింది.రూ.2500 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది.
15.ఐదు జూనియర్ కళాశాలల అఫిలియేషన్ రద్దు
ఏపీ లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆరు జూనియర్ కళాశాల అఫిలియేషన్ రద్దు చేసినట్లు ఆర్ఐఓ శంకర్ నాయక్ తెలిపారు.
16.డీ హెచ్ ఎఫ్ ఎల్ డైరెక్టర్ల పై సీబీఐ కేసులు
34,615 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసిన కేసుకు సంబంధించి డిహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ లు కపిల్, ధీరజ్ వాధవాన్ లపై సీబీఐ కేసులు నమోదు చేసింది.
17.రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

నేషనల్ హెరాల్డ్ కేసులో తన పాత్ర పై ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీనిపై స్పందించారు.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన ఐదు రోజుల పాటు ప్రశ్నించడం తనపై ఎలాంటి ప్రభావం లేదని ఆయన తెలిపారు.
18.రణబీర్ కపూర్ ‘ షం షేరా ‘ టీజర్ విడుదల
రణబీర్ కపూర్ విభిన్న పాత్రలో నటిస్తున్న ‘ షం షేరా ‘ టీజర్ విడుదల అయ్యింది.
19.జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన డీఎస్సీ 1998 అభ్యర్దులు

ఏపీ సీఎం జగన్ కు డీఎస్సీ 1998 అభ్యర్దులు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,450 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 51,760
.