దర్శకుడు బిఎస్ ప్రసాద్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా రా రాజా.( Raa Raja Movie ) ఇప్పటివరకు విడుదల అయినా సినిమాలన్నటకంటే ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పాలి.
ఎందుకంటే పాత్రల ముఖాన్ని చూపించకుండా సినిమా మొత్తం తెరకెక్కించడం అన్నది ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా చూపించలేదు.కానీ ఇందులో మాత్రం డైరెక్టర్ పాత్రల ముఖాన్ని చూపించలేదు.
తాజాగా ఈ సినిమా విడుదల అయింది.ఈ సినిమా కథ ఏమిటి? సినిమా ఎలా ఉంది అన్న వివరాల్లోకి వెళితే.

కథ.
రాజా (సుజీ విజయ్),( Suji Vijay ) రాణి (మౌనిక హెలెన్)( Mounika Helen ) కుటుంబాలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకుంటారు.అంతా బాగానే ఉన్న సమయంలో రాజా తన కుటుంబ సభ్యులను చాలా కాలం తర్వాత కలుసుకుంటాడు.ఆ తర్వాత తన భార్య పై ఎటాక్ చేస్తాడు.అసలు రాజా తన భార్యపై ఎందుకు ఎటాక్ చేశాడు.తన ఫ్యామిలీ మెంబర్స్ ఈమె పై దాడి చేయమన్నారా? లేదంటే మరేదైనా కారణం ఉందా? చివరికి రాణి చనిపోతుందా? చివరికి కథ ఏమయ్యింది? ఈ వివరాలు అన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ.
ఈ మధ్యకాలంలో తెలుగులో నేపథ్యంలో చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి.వాటిలో కేవలం మంచి కథ ఉన్న సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.అయితే దర్శకుడు బీఎస్ ప్రసాద్( Director BS Prasad ) ఈ సినిమాలో పాత్ర ముఖాలను చూపించకుండా చేసిన ఈ ప్రయత్నం మెచ్చుకోదగి విషయం అని చెప్పాలి.
భారతీయ చిత్ర పరిశ్రమలో ఎవరు ఇలాంటి ప్రయత్నం చేయలేదు.దానికి దర్శకుడు హాట్సాఫ్ చెప్పాల్సిందే.అంతేకాదు తాను చెప్పాలనుకున్న విషయాన్ని తెరపై ఎలా చూపిస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారనే దానిపై డైరెక్టర్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు కనిపిస్తోంది.ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం.
కొత్త దర్శకుడైనా చిత్రాన్ని ఎంతో అనుభవం దర్శకడిగా బాగానే డీల్ చేశాడు.కొన్ని సీన్స్ చూస్తే ఆర్జీవి హార్రర్ చిత్రాలను గుర్తుకు వస్తాయ.

నటీనటుల పనితీరు.
సినిమా అంతటా సుజీ విజయ్ తన యాక్టింగ్ మెప్పించాడు.తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.అన్ని వేషాలకు తగ్గట్టుగా నటిస్తూ పాత్రలో జీవించేశారు.అలాగే మౌనిక నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఇక సినిమాలో మిగతా నటీనటులు కూడా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించి మెప్పించారు.
సాంకేతికత.
మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర ఎక్కడ భయపెట్టాలో అక్కడ తన సౌండింగ్ తో ఆకట్టుకున్నాడు.అంటే సౌండ్ వర్క్ సినిమాలో బాగుందని చెప్పాలి.అలాగే కొన్ని చోట్ల బీజీఎంకు ప్రేక్షకులకు భయపెట్టాడు.దర్శకుడి విజన్ కు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ సినిమాను నిలబెట్టాడు.రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరా వర్క్ బాగుంది.మారుతి ఎడిటింగ్ ఎక్కడా ఎంత సీన్ ఉంచాలో మంచిగా తెలిసినట్టు ఉంది.







