టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.మిగతా సినీ పరిశ్రమలతో పోల్చితే తెలుగు సినిమా పరిశ్రమలో రీమేక్ ల హవా చాలా ఎక్కువ.
ఇప్పుడే కాదు.గతంలోనూ వీటి ప్రభావం ఎక్కువగానే ఉంది.
ఒకరిద్దరు టాలీవుడ్ హీరోలు మినహా.మిగతా వారంతా రీమేక్ సినిమాల్లో నటించిన వారే ఉన్నారు.
టాలీవుడ్ అగ్రతారలు సైతం ఎన్నో రీమేక్ సినిమాలు చేశారు.ముఖ్యంగా చిరంజీవి నటించిన ఎన్నో రీమేక్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టాయి.ఇంతకీ ఆయన నటించిన రీమేక్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
చట్టానికి కళ్ళు లేవు
ఈ సినిమా సట్టం ఓరు ఇరుత్తరయ్ అనే తమిళ సినిమాకు రీమేక్.అక్కడ రజనీకాంత్ హీరోగా చేస్తే.ఇక్కడ చిరంజీవి నటించాడు.ఇది చిరు కెరీర్ లో తొలి రీమేక్ మూవీ.
పట్నం వచ్చిన పతివ్రతలు

ఇది కన్నడ సినిమా రీమేక్ మూవీ.పట్టనక్కె బంద పత్నియరు సినిమాను తెలుగులో పట్నం వచ్చిన పతివ్రతలుగా రీమేక్ చేశారు.ఇందులో చిరంజీవి, మోహన్ బాబు, రాధిక, గీత, రమాప్రభ కీ రోల్స్ చేశారు.
టి.ఎస్.బి.కె మౌళి దర్శకత్వం వహించాడు.
ఖైదీ

చిరంజీవికి ఎంతో పేరు తెచ్చిన సినిమా ఇది.ఫస్ట్ బ్లడ్ అనే సినిమా ఆధారంగా కోదండరామి రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.అయితే ఫూర్తి స్థాయి రీమేక్ మూవీ కాదు.ఇందులో హీరోయిన్ గా మాధవి నటించింది.
విజేత

కోదండరామిరెడ్డి దర్వకత్వంలో వచ్చి ఈ మూవీ హిందీలో వచ్చిన సాహెబ్ కు రీమేక్.చిరంజీవి, భానుప్రియ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.
పసివాడి ప్రాణం

మళయాలంలో సూపర్ హిట్ కొట్టిన పూవిను పుతియా సినిమాను తెలుగులో పసివాడి ప్రాణంగా తెరకెక్కించారు.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి సరసన విజయశాంతి హీరోయిన్ గా చేసింది.
ఖైదీ నెంబర్ 786

అమ్మన్ కొవిల్ కిజకాలె అనే తమిళ సినిమాకు ఈ సినిమా రీమేక్.చిరంజీవి కెరీర్ లో ఇదో బెస్ట్ మూవీ.ఈ సినిమాకు విజయ బాపినీడు దర్శకత్వం వహించాడు.భానుప్రియ హీరోయిన్ గా నటించారు.
ఘరానా మొగుడు

కన్నడంలో విజయం సాధించిన అనురాగ ఆరాలితు సినిమాను తెలుగులో ఘరానా మొగుడు పేరుతో రీమేక్ చేశారు.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి, నగ్మా కలిసి నటించారు.
హిట్లర్

మలయాళంలో మమ్ముట్టి హీరోగా వచ్చి మంచి విజయం సాధించిన హిట్లర్ సినిమాను తెలుగులో అదే పేరుత రీమేక్ చేశారు.ఈ సినిమా సంచలన విజయం సాధించింది.ఆయన కెరీర్ లో మరికొన్ని రీమేక్ సినిమాలు కూడా ఉన్నాయి.