చెమటలు పట్టడం అనేది సర్వ సాధారణ విషయం.ఈ సహజ సిద్ధమైన శారీరక ప్రక్రియ ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది.
కానీ, కొందరిలో మాత్రం చెమటలు కాస్త అధికంగా పడుతుంటాయి.ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.
ఒంట్లో వేడి ఎక్కువగా ఉండటం, ఒత్తిడి, ఓవర్‌గా ఉప్పు తీసుకోవడం, పలు రకాల మందుల వాడకం, ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, రక్త పోటు ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండటం, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల అధిక చెమటలు పడుతుంటాయి.
ఇక ఈ చెమటల వల్ల వేసుకున్న దుస్తులన్నీ తడిచిపోతాయి.
అలాగే చెమట నుంచి వెలువడే దుర్వాసన కారణంగా పక్కన వారికి అసౌకర్యం, మనకు చికాకు రెండూ పెరుగుతాయి.అందుకే అధిక చెమట నివారణకు పరిష్కార మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడంలో యాపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా సహాయపడుతుంది.మరి దీనిని ఎలా యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్, ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన వాటర్‌లో దూది ముంచి.
అండర్ ఆర్మ్స్, మెడ, అరికాళ్లు, చెవుల వెనక, చేతులు ఇలా చెమటలు అధికంగా పట్టే చోట్లు అద్దుకోవాలి.ఇలా రాత్రి నిద్రించే ముందు చేసి.ఉదయం గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల అధిక చెమటలు పట్టకుండా ఉంటాయి.

చెమట దుర్వాసనతో బాధ పడే వారు.ఒక బౌల్ తీసుకుని అందులో అర స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, మూడు స్పూన్ల నిమ్మ రసం వేసి కలపండి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దూది సాయంతో బాగా చెమటలు పట్టే చోట్ల అప్లై చేయాలి.ఇలా చేయడం వల్ల చెమటల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.మరియు అధికంగా చెమటలు పట్టడం కూడా తగ్గుతుంది.