ఒకదాని కోసం ఆశపడి.మరొకదానిని వదులుకుంటే.
చివరకు రెండూ పోయినట్లు చెప్తారు పెద్దలు.సేమ్ ఇలాగే ఉంది కమెడియన్ కం హీరో సునీల్ పరిస్థితి.
కమెడియన్ గా మాంచి ఫామ్ ఉన్న సమయంలో హీరోగా ట్రై చేశాడు సునీల్.కొన్ని సినిమాలు చేశాడు.అందులో కొన్ని మంచి విజయాన్ని కూడా అందుకున్నాయి.ఆ తర్వాత పరాజయాలు మొదలయ్యాయి.నెమ్మదిగా సునీల్ కనిపించడం మానేశాడు.ప్రస్తుతం మళ్లీ కామెడీ రోల్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.
కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాడు.తాజాగా ఎఫ్ 3 సినిమాలో మంచి రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
వెంకటేష్-వరుణ్ తేజ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ఎఫ్2.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఇద్దరు హీరోల కామెడీ ఎంతో ప్లస్ పాయింట్ అయ్యింది.తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రెడీ చేస్తున్నాడు డైరెక్టర్.
ఇందులో సునీల్ ను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇందులో సునీల్ ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ చేస్తున్నాడట.
అదీ పరమ పిసినారి పాత్రట.ఒక్కమాటలో చెప్పాలంటే ఆహా నాపెళ్లంట సినిమాలు కోటా శ్రీనివాసరావు చేసిన క్యారెక్టర్ ను సునీల్ ఇందులో చేస్తున్నాడట.
ఈ సినిమాకు సునీల్ క్యారెక్టర్ హైలెట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది.అప్పుల వాడి క్యారెక్టర్ లో వెంకటేస్-వరుణ్ తేజ్ ను పీడించే వాడిలా కనిపిస్తాడట.

తొలుత ఈ సినిమాలో ఈ పాత్ర కోసం రాజేంద్ర ప్రసాద్ ను అనుకున్నారట.అయితే సునీల్ అయితే ఈ తరం వాళ్లకు బాగా సూట్ అవుతుందని దర్శకుడు భావించాడట.అందుకే తనను తీసుకున్నాడట.అటు ఈ సినిమా అంతా డబ్బు చుట్టు తిరుగుతుందట.ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లు సైతం మంచి పాపులారిటీ సంపాదించాయి.సీక్వెల్ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలయ్యింది.
అటు ఈ సినిమాలో క్యారెక్టర్ పై సునీల్ భారీగా అంచనాలు పెట్టుకున్నాడట.తన కెరీర్ మళ్లీ గాడిన పడాలంటే ఈ క్యారెక్టర్ ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నాడట.
ఈ దెబ్బతో మళ్లీ కమెడియన్ గా గుర్తింపు పొందాలి అనుకుంటున్నాడట.