ఏ భాషలో సినిమా హిట్ అయినా.వాటిని ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేయడమో.
లేదంటే రీమేక్ చేయడమమో జరుగుతంది.అయితే అసలు సినిమాలోని స్టోరీని తీసుకుని ఆయా భాషల నేటివిటీకి అనుగుణంగా సినిమాల్లో మార్పులు చేర్పులు చేస్తేనే విజయం సాధిస్తాయి.
లేదంటే బోల్తా కొడతాయి.కొన్ని సినిమాలు అసలు సినిమాతో పోల్చితే రీమేక్ సినిమాలే మంచి విజయం సాధిస్తాయి.
మరికొన్ని సినిమాలు అసలు ఇది రీమేకేనా అనే ఆశ్చర్యం కలిగిస్తాయి.అసలు సినిమా ఏంటి? వీరు తీసింది ఏంటి? అని జనాలు నవ్వుకుంటారు.
ఇతర భాషల్లో మంచి విజయం అందుకున్న చాలా సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి.అందులో పలు సినిమాలు హిట్ అయ్యాయి.మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.సక్సెస్ అయిన సినిమాల్లో చాలా వరకు తెలుగు జనాలకు కనెక్ట్ అయ్యేలా కథలో మార్పులు చేశారు.
కానీ కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి.దానికి కారణంగా మూల కథను ఉన్నది ఉన్నట్లు దించేశారు దర్శకులు.
అలా ఇతర భాషల్లో విజయం సాధించి.తెలుగు రీమేక్ సినిమాలు ఫ్లాప్ అయినవి చాలా ఉన్నాయి.
ఆ లిస్టు ఏంటో ఇప్పుడు చూద్దాం.
* బోల్ బచ్చన్ – మసాలా
* త్రీ ఇడియట్స్ – నన్బన్ – స్నేహితుడు
* 96 – జాను
* విక్కీ డోనర్ – నరుడా డోనరుడా
* జంజీర్ – తుఫాన్
* కిరిక్ పార్టీ – కిరాక్ పార్టీ
* వీరం – కాటమరాయుడు
* ఆషికి 2 – నీ జతగా నేనుండాలి

* బ్యాండ్ బాజా బారాత్ – ఆహా కళ్యాణం
* జిగర్తాండా – గద్దల కొండ గణేష్
* మాన్ కరాటే – తుంటరి
* సూదు కవ్వం – గడ్డం గ్యాంగ్
* హంటర్ – బాబు బాగా బిజీ

* తను వెడ్స్ మను – మిస్టర్ పెళ్ళికొడుకు
* నేరం – రన్
* జబ్ వి మెట్ – కండేన్ కాదలై – ప్రియా ప్రియతమా
* బాడీ గార్డ్ – బాడీ గార్డ్
* ఫస్ గయే రే ఒబామా – శంకరాభరణం
* ముంగారు మళై – వాన
* ఢిల్లీ బెల్లీ – సెట్టై – క్రేజీ