సాధారణంగా చాలా మంది ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఆరోగ్యంపై శ్రద్ధ అనేది చూపరు.కానీ, ఆరోగ్యంగా ఉన్నా.
లేకపోయినా దానిపై శ్రద్ధ చాలా అవసరం.ముఖ్యంగా అన్ని పోషకాలు శరీరానికి అందేలా చూసుకోవాలి.
ఇప్పుడే ఆరోకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపలం.ఇదిలా ఉంటే.
మనల్ని ఆరోగ్యంగా ఉంచే అతి ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం ఒకటి.రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపు చేయడంలోనూ, హార్మోన్స్ సరిగా పనిచేసేందుకు తోడ్పడటంలోనూ, ఎనర్జీ లెవల్స్ అందించడంలోనూ, ఫిట్‌గా ఉండేలా చేయడంలోనూ.ఇలా అనేక విధాలు మెగ్నీషియం శరీరానికి చాలా అవసరం.
అయితే అలాంటి ముఖ్యమైన పోషకం లోపిస్తే.
వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు.మెగ్నీషియం లోపిస్తే.
నీసరం, ఆకలి వేయకపోవడం, వాంతులు, వికారం, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.అలాగే మెగ్నీషియం లోపం వల్ల హర్ట్ బీట్ పెరిగిపోతుంది.
ఈ సమయంలో ఒక్కోసారి గుండె పొటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.శరీరంలో మెగ్నీషియం లోపిస్తే.
డిప్రెషన్, మానసిక ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

అంతేకాకుండా, ధమనులు రక్తప్రవాహం సమయంలో సంకోచవ్యాకోచాలకు లోనవడానికి మెగ్నీషియం అవసరం.కానీ, ఇది లోపిస్తే ధమనులు గట్టిపడి రక్తపోటు పెరిగిపోతోంది.దాంతో అనేక సమస్యలు చుట్టు ముట్టేస్తాయి.
ఇక ఎముకలు, దంతాలు, కండరాలు దృఢంగా ఉండాలంటే క్యాల్షియంను శరీరం శోషించుకోవాలి.అలా శోషించుకోవాలంటే మెగ్నీషియం అవసరం.
ఒకవేళ మెగ్నీషియం లోపిస్తే.ఎముకలు, దంతాలు, కండరాలు బలహీనంగా మారపోయాయి.

కాబట్టి, మన డైట్‌లో మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఫుడ్‌ను ఖచ్చితంగా చేర్చుకోవాలి.ఆకుపచ్చని కూరగాయలు, నట్స్, తృణధాన్యాలు, సీఫుడ్, బ్రొక్కొలి, క్యాబేజ్, గ్రీన్‌బఠాణీలు, డార్క్ చాక్లెట్, ఆకుకూరలు అరటి పండు, ఆవకాడో వంటి వాటిలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది.సో.వీటిని రెగ్యులర్ తీసుకుంటే మెగ్నీషియం లోపానికి గురి కాకుండా ఉంటారు.