కాస్ట్ కటింగ్( Cost Cutting ) పేరుతో అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులను( Federal Workers ) తొలగిస్తోంది ట్రంప్ ప్రభుత్వం .ఇప్పటికే పలు విభాగాల్లోని కీలక అధికారులు సహా వందలాది మంది ఉద్యోగులను తొలగించింది.
ఇందుకు అనుగుణంగా డొనాల్డ్ ట్రంప్( President Donald Trump ) ఇటీవల కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేశారు.ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)లో కీలక హోదాలో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఉద్యోగాన్ని కోల్పోయారు.
ఈమెను నాసా( NASA ) జెట్ ప్రొపల్షన్ లాబోరేటరీ (జేపీఎల్)లో డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ (డీఈఈ) మాజీ హెడ్ నీలా రాజేంద్రగా( Neela Rajendra ) గుర్తించారు.నివేదికల ప్రకారం.
ట్రంప్ ఉత్తర్వుల ప్రకారం ఫెడరల్ ఏజెన్సీలలోని అన్ని డీఈఐ సంబంధిత హోదాలు, కార్యక్రమాలను రద్దు చేయడం తప్పనిసరి.

భారత సంతతికి చెందిన రాజేంద్ర అనేక సంవత్సరాలుగా నాసాలో సీనియర్ డీఈఐ హోదాలో సేవలందించారు.మహిళలు, మైనారిటీల నియమకాన్ని పెంచే లక్ష్యంతో నాసా ‘‘స్పేస్ వర్క్‌ఫోర్స్ 2030’’( Space Workforce 2030 ) వంటి కార్యక్రమాలకు ఆమె నేతృత్వం వహించారు.ఆమెపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రభావం చూపుతుందని ముందే ఊహించిన నాసా.
నీలా పోస్టును ‘‘హెడ్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ టీమ్ ఎక్సలెన్స్ అండ్ ఎంప్లాయీ సక్సెస్’’గా మార్చింది.అయినప్పటికీ ఆమె నిర్వర్తించే బాధ్యలు డీఈఐ మాదిరిగానే ఉంటాయి.
బ్లాక్ ఎక్సలెన్స్ స్ట్రాటజిక్ టీమ్ వంటి అనుబంధ సమూహాలను పర్యవేక్షించడం ఇందులో ఉన్నాయి.

నాసా తీవ్రంగా ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ .ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను కఠినంగా అమలు చేయడంతో ఏప్రిల్ ప్రారంభంలో రాజేంద్రను విధుల నుంచి తప్పించక తప్పలేదు.ఎన్డీటీవీ నివేదిక ప్రకారం.
నీలా రాజేంద్ర ఇకపై జెట్ ప్రొపల్షన్ లాబోరేటరీలో పనిచేయరు.ఆమె మా సంస్థపై చూపిన ప్రభావానికి ధన్యవాదాలు అని జేపీఎల్ డైరెక్టర్ లారీ లెషిన్ నుంచి వచ్చిన అంతర్గత ఈమెయిల్‌లో పేర్కొన్నారు.
అయితే గతంలో 2024లోనే రాజేంద్ర తొలగింపు జరగాల్సి ఉంది.ఆ సమయంలో నిధుల లేమీ కారణంగా దాదాపు 900 మంది అధికారులను తొలగించారు.