సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోలందరు భారీ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.మరి ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలందరు భారీ విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్లే కావడం విశేషం…

తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి రజినీకాంత్( Rajinikanth ) లాంటి స్టార్ హీరో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నప్పటికి ఆయన పూర్వ వైభవాన్నితో సాధించలేకపోతున్నారు.రోబో 2.0 సినిమాతో 800 కోట్ల వరకు కలెక్షన్లు రాబడినప్పటికి అసలు ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.ఇక జైలర్ సినిమాతో 400 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టారు.
మరి ఏది ఏమైనా కూడా రజనీకాంత్ ఇప్పుడు చేస్తున్న కూలీ ,( Coolie ) జైలర్ 2( Jailer 2 ) సినిమాలతో సరైన సక్సెస్ లను సాధించి చూపించాల్సిన అవసరమైతే ఉంది.లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ భారీగా పడిపోవడమే కాకుండా ఆయనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకోవడం తీవ్రంగా వెనకబడిపోతారనే చెప్పాలి…

మరి ఇలాంటి సందర్భంలో రజినీకాంత్ లాంటి గొప్ప నటుడు సైతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అయితే అందించారు.ఇప్పటి వరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి… లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో చేస్తున్న కూలీ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందంటూ కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి.మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నారనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.