అరికాళ్ళు విపరీతంగా మంట పుడుతున్నాయా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోండి!

అరికాళ్ళ‌ మంటలు. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యను ఫేస్ చేస్తుంటారు.

 Best Foods To Get Rid Of Burning Feet!, Burning Feet, Burning Feet Causes, Vitam-TeluguStop.com

అరికాళ్ళ‌ మంట వ‌ల్ల‌ రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర కూడా పట్టదు.అయితే అరికాళ్ళ‌ మంటలకు కారణాలు అనేకం.

ప్రధానంగా చూసుకుంటే విటమిన్ బి12 లోపం వల్ల అరికాళ్ళు విపరీతంగా మంట పుడుతుంటాయి.మీరు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారా.? అయితే మీకు విటమిన్ బి12 చాలా అవసరం.ఇది లోపిస్తే పాదాల్లో నాడులు దెబ్బతింటాయి.

దీంతో మంట, నొప్పి వంటివి తలెత్తుతుంటాయి.

మరి ఇంతకీ విటమిన్ బి 12 ఎలా పొందాలి.? ఏయే ఆహారాల్లో లభిస్తుంది.? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.పాలలో విటమిన్ బి 12 పుష్కలంగా నిండి ఉంటుంది.అలాగే పాల నుండి తయారయ్యే పెరుగు, చీజ్, పన్నీరు వంటి ఉత్పత్తుల్లోనూ ఉంటుంది.కాబట్టి అరికాళ్ళ‌ మంటలతో బాధపడేవారు వీటిని డైట్ లో చేర్చుకోవాలి.

అలాగే అరికాళ్ళ మంటలతో సతమతం అవుతున్న వారు నిత్యం ఉడికించిన గుడ్డును తీసుకోండి.

దీని ద్వారా విటమిన్ బి12తో పాటు విట‌మిన్ బి1, విట‌మిన్ బి5 కూడా లభిస్తాయి.చికెన్ లేదా మటన్ తెచ్చినప్పుడు అందులో లివర్ క‌నిపిస్తే చాలా మంది పక్కన పడేస్తారు.

కానీ చికెన్ మరియు మటన్ లివర్ లో విట‌మిన్ బి12 మెండుగా నిండి ఉంటుంది.కాబట్టి ఇకపై చికెన్, మటన్ లివర్ ను అస్సలు అవాయిడ్ చేయకండి.

పాలకూర, చాపలు, పీతలు, మష్రూమ్స్, పొద్దుతిరుగుడు విత్త‌నాలు, అవ‌కాడో వంటి ఫుడ్స్ లోనూ విటమిన్ బి12 లభిస్తుంది.కాబట్టి ఎవరైతే అరికాళ్ళ‌ మంటలతో విపరీతంగా బాధపడుతున్నారో తప్పకుండా వారు ఈ ఫుడ్స్ డైట్ లో చేర్చుకోండి.అవసరం అయితే వైద్యులను సంప్రదించి విటమిన్ బి12 టాబ్లెట్స్ ను కూడా వాడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube