రాఖీ కట్టడం ఎప్పుడు మొదలైంది.. రాఖీ కట్టేటప్పుడు ప్లేట్లో ఈ వస్తువులు తప్పకుండా ఉండాలి..!

ముఖ్యంగా చెప్పాలంటే శ్రావణ పూర్ణిమ కు రక్ష పూర్ణిమ, రాఖీ పూర్ణిమ అనే పేర్లు కూడా ఉన్నాయి.అసలు ఈ రక్షాబంధన్( Raksha Bandhan ) అంటే ఏమిటో తెలుసుకోవాలని ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు.

 Keep These Items In Pooja Plate While Tying Rakhi Details, Rakhi, Raksha Bandhan-TeluguStop.com

అప్పుడు శ్రీకృష్ణుడు( Sri Krishna ) పూర్వం దేవాసుర యుద్ధం ఘోరంగా జరిగినప్పుడు ఇంద్రుడు పరాజీతుడై సహచరులతో అమరావతిలో తలదాచుకున్నాడు.దానితో దానవరాజు త్రీలోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకోగా దేవ పూజలు మూలాన పడ్డాయి.

పూజలు లేకపోవడంతో సురాపతి బలము సన్నగిల్లింది.అప్పుడు అమరావతిలోని ఇంద్రుని మీదకు మళ్ళీ రాక్షసులు దండెత్తి వచ్చారు.

అప్పుడు ఇంద్రాణి( Indrani ) తన భర్త అయినా సురేంద్రునికి రక్షకట్టి విజేతవు కమ్మని పంపించింది.ఆ విధంగా సురేంద్రుడు( Surendrudu ) దానవులను గెలిచి తిరిగి స్వర్గంలోకి ప్రవేశించాడు.

ఈ రక్ష ప్రభావం సంవత్సరం పాటు ఉంటుందని ఆపై అతన్ని గెలవవచ్చని శుక్రాచార్యుడు దుఃఖాభితులై ఉన్న దానవులను ఓదార్చాడు.అప్పటినుంచి రాఖి కట్టడం( Rakhi ) మొదలైందని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే రాఖి పూర్ణిమ వచ్చినప్పుడు తిది నక్షత్రం ప్రకారం సోదరీ సోదరుడికి లేదా తాత చేతికి రాఖీ కట్టాలి.రాఖీ కట్టడంతో పాటు పూజ ఆరాధన కూడా ఉంటుంది.

అలాగే నియమాలను కూడా తెలుసుకొని పాటించాలి.

రాఖీ కట్టే ముందు కుటుంబ దేవత పాదాలను తాకాలి.పూజ ప్లేట్లో( Pooja Plate ) రాఖిని వేసి దేవుడి పాదాలను తాకి ఆ తర్వాత రాఖీని కట్టాలి.రాఖీ కట్టిన తర్వాత సోదరీ సోదరుడి నుదుటిపై పుణ్యతీలకం రాయాలి.

మీ సోదరుని నుదుటి పై కుంకుమ తిలకం ఉంచాలి.ఈ సంకేతం లక్ష్మీదేవికి మరియు సంపదకు చిహ్నంగా పరిగణిస్తారు.

పూజలో అందించే అటప్చల్ మొత్తాన్ని అక్షిత అంటారు.ఈ బియ్యాన్ని( Rice ) చిన్న గిన్నెలో వేసి మీ అన్నయ్య నుదుటిపై రాయాలి.

అలాగే గంధం మనసు ప్రశాంతతకు ప్రతీక.

సోదరుని నుదుటిపై చందనపు తిలకం పూయడం ద్వారా విష్ణువు గణేశుని అనుగ్రహం లభిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.అలాగే వెలిగించిన దీపం అంగారకుడినీ, శుభ కాంతిని సూచిస్తుంది.రాఖీ పళ్లెంలో పెట్టిన దీపంలో హారతి( Harathi ) ఇస్తూ దీపం వెలుగులో సోదరుడి ముఖం చూడాలి.

ఇంట్లో తయారు చేసిన స్వీట్లను( Sweets ) ఒకరికి ఒకరు తినిపించుకోవాలి.నియమాలను ఎంతో జాగ్రత్తగా అనుసరించడం మంచిది.

Important things to include in the Rakhi thali

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube