క్రిస్మస్ మరో రెండు వారాల సమయం ఉంది.పండుగ కి సలార్ మరియు డుంకీ సినిమా లు రాబోతున్నాయి.
కనుక రెండు వారాల ముందే మీడియం రేంజ్ సినిమా లను వదులుతున్నారు.నేడు నాని నటించిన హాయ్ నాన్న( Hi Nanna ) సినిమా వచ్చింది.
రేపు నితిన్ నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మూవీ( Extra Ordinary Man ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈ రెండు సినిమాలతో పాటు ఇదే వారంలో మెగా హీరో వరుణ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా( Operation Valentine ) రావాల్సి ఉంది.
కానీ చివరి నిమిషం లో సినిమా ను విడుదల చేయకుండా వాయిదా వేయడం జరిగింది.ఎందుకు వాయిదా వేశారు అనే విషయం లో కూడా క్లారిటీ ఇవ్వలేదు.

వరుణ్ తేజ్ పెళ్లి కి( Varun Tej Marriage ) వెళ్లే సమయంలో హడావుడిగా సినిమా షూటింగ్ ను ముగించడం తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో కూడా వరుణ్ పాల్గొన్నాడు.అంత స్పీడ్ గా సినిమా ను ముగించిన మేకర్స్ ఎందుకు విడుదల చేయడం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.ఈ తేదీ మిస్ అయితే మరో రెండు వారాల పాటు సినిమా విడుదలకు సరైన సమయం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అసలు వరుణ్ తేజ్( Varun Tej ) సినిమా ను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందని ఈ సందర్భం గా కొందరు మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి కూడా పెద్దగా పబ్లిసిటీ చేయడం లేదు.అసలు ఎందుకు ఈ సినిమా కి లో ఫ్రొఫైల్ మెయింటెన్ చేశారు అనేది కూడా తెలియడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఈ వారం విడుదల అయిన సినిమా లకు పోటీ లేకపోవడం తో రెండు కూడా మంచి ఓపెనింగ్స్ ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ముందు ముందు కూడా విడుదల అయ్యే సినిమా లకు పాజిటివ్ గా టైమ్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కనుక ఈ సమయం ని వరుణ్ మిస్ చేసుకున్నాడు అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.