తిండి లేని స్థాయి నుండి పద్మ శ్రీ దాకా.. మొగిలయ్య కష్టాలు అన్నీ ఇన్నీ కావు

భీమ్లానాయక్ మూవీలో పాట పాడిన కిన్నెర కళాకారుడు మొగిలయ్యకు అరుదైన గౌరవం దక్కింది.ఆయనను పద్మశ్రీ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

 From The Level Of Not Having Food To Padma Shri   Mogilayya's Troubles Are Not A-TeluguStop.com

నాగర్‌‌కర్నూల్‌ జిల్లా అవుసలికుంట గ్రామానికి చెందిన ఆయన.కిన్నెర‌నాదం‌తో ప్రజల మనస్సును దోచుకున్నారు.గ్రామాల్లో తిరుగుతూ కిన్నెర వాయిద్యంతో అందరినీ అలరించేవాడు.అలా తెలుగు మూవీ పాటలు పాడే స్థాయికి ఎదిగారు మొగిలయ్య.ప్రభుత్వం సైతం ఆయన ప్రతిభను గుర్తించి ఎన్నో సత్కారాలను ఆయనకు అందించింది.ఆయన ఆర్టీసీ బస్సులపైనా పాట పాడారు.

దానిని విన్న ప్రభుత్వం ఫిదా అయింది.ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేసేందుకు బస్ పాస్ సైతం ఇచ్చింది.

నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం గుట్టరాయిపాకులలో పుట్టారు మొగిలయ్య.తన తండ్రి, తాత నుంచి కిన్నెర వాయిద్యాన్ని నేర్చుకున్నారు.అనంతరం అవుసలికుంటలో స్థిరపడిపోయారు.మొదట ఆయన పూట గడవడానికి సైతం ఇబ్బంది పడేవారు.కిన్నెర కళనే నమ్ముకుని పాఠశాలల్లో ప్రదర్శనలు ఇస్తుండేవారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆయన ప్రతిభకు గౌరవం లభించింది.

ఇక ప్రస్తుతం భారత ప్రభుత్వం సైతం ఆయనను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది.దీంతో మొగిలయ్య ఆనందానికి అవుధులు లేకుండా పోయాయి.

సీఎం కేసీఆర్‌కు, కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ సారీ కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులకు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా ఏడు మంది ఎంపికయ్యారు.

అందులో తెలంగాణకు చెందిన వారు నలుగురు ఉండగా, ఏపీ నుంచి ముగ్గురు ఉన్నారు.వీరిలో తెలంగాణ నుంచి నృత్యకారిణి పద్మజారెడ్డి, ఆదివాసి కళాకారుడు రామచంద్రయ్య సైతం ఉన్నారు.

పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్న భీమ్లా నాయక్ మూవీలో మొగిలయ్య పాడిన పాట ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube