బోలే షావలి.( Bhole Shavali ) బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చాడు ఈ పాట బిడ్డ.
మొదటి వారమే అతని అతి వాగుడు ప్రవర్తన చూసి అందరూ ఎలిమినేట్ అయిపోతారని భావించారు.కానీ ఎవరు ఊహించని విధంగా ప్రియాంక,( Priyanka ) శోభల( Shobha Shetty ) గొడవతో బోలే షావలి రేటింగ్ రోజుకు పెరుగుతూ వెళ్ళింది.
అదే పర్ఫామెన్స్ ఇవ్వడానికి కూడా బోలే షావలికి స్కోప్ నీ ఇచ్చింది.ఇప్పటికే హౌస్ లో ప్రియాంక మరియు శోభ, అమర్ వంటి సీరియల్ బ్యాచ్ తో విసిగిపోయిన ప్రేక్షకులు బోలే వంటి విభిన్నమైన ఆటగాడికి కనెక్ట్ అయ్యారు.
పైగా వచ్చి రాగానే మొదటి వారమే అతడి పై వారు చూపించిన అతి ఆవేశానికి జనాలు సైతం భోలే వైపు మొగ్గు చూపారు.

వచ్చి ఇన్ని వారాలు అవుతున్న ఆట తీరులో కూడా అతని ప్రభావం కాస్త మెరుగ్గానే ఉంది.ప్రతి వారం బోలే షావలి తనను తాను మెరుగుపరుచుకుంటూ నామినేషన్స్ నుంచి సేవ్ అవుతూ వస్తున్నాడు.ఇదే సమయంలో అతను ప్రతి ఒక్క కంటెస్టెంట్ పై చూపిస్తున్న ప్రేమ కూడా అందరిని కనెక్ట్ చేస్తోంది.
ఇక మరోవైపు అతడు ప్రతి ఒక్కరిపై పాడే పాటలు( Bhole Shavali Songs ) కూడా జనాలకు ఎంతగానో నచ్చుతున్నాయి.నిన్నటికీ నిన్న అతని భార్య సీమ( Seema ) హౌస్ లోకి రాగానే పాటల సందడి మొదలైంది.
ఆమెకు సంబంధించి పాటలు పాడమంటూ బిగ్ బాస్( Bigg Boss ) బోలే షావలిని ఎంకరేజ్ చేయడం కూడా ప్రతి ఒక్కరు గమనించారు.ఏమాత్రం వాతావరణం అటు ఇటుగా ఉన్న బోలే తన పాటలతో వారి మూడ్ ని మార్చేస్తాడు.
అంతేకాదు తన మాట్లాడే విధానం కూడా పంచ్ డైలాగ్ తో కూడి ఉండడం తనని అందరికీ లోకెల్లా విభిన్నంగా ఉండేలా చూసుకుంటుంది.

ఇక కప్పు గెలవడానికి మరో ఐదు వారాలు మిగిలి ఉన్నప్పటికీ అతడు ఇప్పటి వరకు కప్పు గెలవాలని ఆశయాన్ని బహిర్గతం చేయలేదు.అందరూ బాగా ఆడుతున్నారు అందరికీ కప్పు గెలవడానికి అర్హత ఉంది అని బోలే చెప్పిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది.బోలే నిస్వార్ధమైన మాటలకు జనాలు ఫిదా అవుతున్నారు.
ఇలాగే ముందు ముందు ఇంకా బాగా ఆడితే టాప్ ఫైవ్ లో కచ్చితంగా బోలే షావలి ఉండటం ఖాయం అంటూ చెబుతున్నారు ఇప్పటివరకు సోషల్ మీడియాలో బోలె లేకపోవడంతో అతనికి ప్రేక్షకులు తక్కువగానే ఉన్న బిగ్ బాస్ ద్వారా అతనికి అభిమానులు బాగా పెరిగారు.







