తెలంగాణలో పర్యటన సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.అనంతరం ఎయిర్ పోర్టులో షా తెలంగాణ రైతు సంఘాల నేతలతో సమావేశం అయ్యారు.
ఈ క్రమంలో రైతుల సమస్యలపై చర్చించిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు పెంచాలని, రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని రైతులు కోరారు.అలాగే విద్యుత్ చట్టం మార్చాలని వేడుకొన్నారు.దీనికి సమాధానమిచ్చిన అమిత్ షా.విద్యుత్ చట్టాన్ని మార్చడం కాదు, తెలంగాణలో ప్రభుత్వాన్ని మార్చండి అంటూ వ్యాఖ్యనించారు.అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు.







