కరోనా సమయంలో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో వారికి నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు నటుడు సోనుసూద్( Sonu Sood ) .వెండితెరపై విలన్ గా అందరిని భయపెట్టిన ఈయన తెరవెనక మాత్రం రియల్ హీరో అనిపించుకున్నారు.
కరోనా( Corona ) సమయంలో ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడడంతో అందరి మధ్యలో సోను సూద్ ఒక దేవుడిగా మిగిలిపోయారు.వెండితెరపై విలన్ అనిపించుకున్నటువంటి ఈయన నిజ జీవితంలో మాత్రం అందరికీ హీరోగా మారిపోయారు.
ఇక కరోనా తగ్గిపోయిన తర్వాత ఈయన తన సేవా కార్యక్రమాలను ఏమాత్రం తగ్గించలేదు.ఇలా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఎప్పటికప్పుడు తన మంచి మనసును చాటుకుంటున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు.అయితే ఈ వీడియో చూసిన నెటిజెన్స్ సోను సూద్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు.
మండుటెండలో ఇటుకలు( Bricks ) తయారు చేస్తున్నటువంటి ఓ కార్మికుడు వద్దకు సోను సూద్ వెళ్లారని తెలుస్తోంది.
ఇలా ఆ కార్మికుడి వద్దకు వెళ్లినటువంటి ఈయన ఇటుకలు ఎలా తయారు చేయాలో అతని వద్ద నేర్చుకున్నారు.అలాగే తానే స్వయంగా ఆ ఎండలో ఇటుకలను తయారు( Making Bricks ) చేస్తూ కనిపించారు.ఇలా కార్మికులతో పాటుగా ఇటుకలను తయారు చేయడంతో ఈయన సింప్లిసిటీ పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ… దేశంలోని కార్మికులే దేశాన్ని బలంగా తయారు చేస్తారు అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ జోడించారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో చూసినటువంటి నేటిజన్స్ మరీ ఇంత మంచోడు అయితే ఎలాగయ్యా అంటూ కామెంట్లు చేయగా నువ్వు పేదల పాలిట దేవుడివి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.