మొటిమలు మచ్చలను పోగొట్టి ముఖాన్ని తెల్లగా మెరిపించే ఎఫెక్టివ్ రెమెడీ ఇది..!

ముఖ చర్మంపై ఎటువంటి మొటిమలు, మచ్చలు( Acne Scars ) లేకుండా తెల్లగా అందంగా మెరిసిపోతూ కనిపించాలని మగువలు తెగ ఆరాటపడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే మార్కెట్లో లభ్యమయ్యే రకరకాల స్కిన్ కేర్ ఉత్పత్తులను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు.

 This Is An Effective Remedy To Get Rid Of Acne Scars And Whiten The Face Details-TeluguStop.com

అయితే వాటి వల్ల ఎన్ని లాభాలు, మరెన్ని నష్టాలు ఉంటాయి అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మాత్రం మొటిమలు, మచ్చలను పోగొట్టి ముఖాన్ని తెల్లగా( Glowing Skin ) మెరిపించడంలో సూపర్ ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Acne, Acne Scars, Tips, Dark Spots, Dry Lemon Peel, Dry Orange Peel, Skin

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో అర కప్పు ఎండిన ఆరెంజ్ తొక్కలు,( Dry Orange Peel ) అర కప్పు ఎండిన నిమ్మ తొక్కలు,( Dry Lemon Peel ) అర కప్పు ఎండిన గులాబీ రేకులు మరియు అర కప్పు ఎండిన వేపాకు వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్, లెమన్, నీమ్ అండ్ రోజ్ పెటల్స్ పౌడర్ ను వేసుకోవాలి.

అలాగే పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు మరియు సరిపడా పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Acne, Acne Scars, Tips, Dark Spots, Dry Lemon Peel, Dry Orange Peel, Skin

ఇలా త‌యారు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.15 నిమిషాల అనంతరం చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటించడం వల్ల మొటిమల బెడద తగ్గు ముఖ పడుతుంది.

చర్మంపై ఎలాంటి మచ్చలు ఉన్న క్రమంగా మాయం అవుతాయి.చర్మం పై పేరుకుపోయిన మురికి, మృత కణాలు తొలగిపోతాయి.

స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.మొటిమలు మచ్చలు లేని తెల్లటి మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

కాబట్టి సహజంగానే అందంగా మెరిసిపోవాలి అని భావించేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube