భార్యకు భిక్షాటన చేస్తున్న వ్యక్తి వినూత్న బహుమతి

పెళ్లయ్యాక భార్యాభర్తల మధ్య ప్రేమ కలగడం చాలా సహజం.కానీ ఆ ప్రేమను జీవితాంతం అలాగే ఉంచుకోవడం చాలా కష్టం.

 A Man Begging His Wife For An Innovative Gift , Wife,husband, Viral Latest, News Viral, Social Media, Moped,chindwara District , Madhya Pradesh, Munni Sahu,sahu-TeluguStop.com

భర్త తన భార్య కోసం ఎన్నో గొప్ప పనులు చేశాడనే కథలు మనం ఎన్నో విని ఉంటాం.కానీ తన భార్య కోసం ఓ వ్యక్తి మోపెడ్ కొనడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది.

ఇందులో పెద్ద వింతేమీ లేకపోయినా, ఆ మోపెడ్ కొన్న వ్యక్తి భిక్షాటన చేస్తూ జీవించే వాడు కావడం కొంత ఆసక్తికరమని చెప్పొచ్చు.వృద్ధాప్యంలో ఉన్న ఆ భార్యాభర్తలిద్దరూ మోపెడ్‌పై భిక్షాటన చేస్తున్నారు.

 A Man Begging His Wife For An Innovative Gift , Wife,husband, Viral Latest, News Viral, Social Media, Moped,Chindwara District , Madhya Pradesh, Munni Sahu,Sahu-భార్యకు భిక్షాటన చేస్తున్న వ్యక్తి వినూత్న బహుమతి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హృదయాన్ని హత్తుకునే ఈ ప్రత్యేకమైన ప్రేమకథ మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో జరిగింది.ఆ యాచకుడు తన భార్యను చాలా ప్రేమిస్తాడు.

భిక్షాటన చేస్తూ వారు జీవనం సాగిస్తున్నారు.వారిద్దరిలో భర్త పేరు సంతోష్ సాహు కాగా, భార్య పేరు మున్ని సాహు.

వారు చింద్వారా జిల్లాలోని అమర్వాడ నివాసితులు.వాస్తవానికి సంతోష్ దివ్యాంగుడు.

అతను ట్రైసైకిల్‌తో తిరుగుతూ భిక్షాటన చేసేవాడు.అతడికి భార్య మున్నీబాయి సాయం చేసేది.

అయితే అధ్వాన్నమైన రహదారుల కారణంగా అతని భార్య ట్రైసైకిల్‌ను నెట్టడం చాలా కష్టంగా ఉందని సంతోష్ గమనించాడు.ఈ కారణంగా అతని భార్య కూడా చాలాసార్లు అనారోగ్యానికి గురైంది.

దీంతో వైద్యం కోసం చాలా డబ్బు కూడా ఖర్చయింది.ఈ క్రమంలో ఒక రోజు సంతోష్ భార్య మున్నీ మోపెడ్ కొనమని సలహా ఇచ్చింది.

క్లిష్ట పరిస్థితిని చూసిన సంతోష్.తన భార్యకు ఎలాగైనా మోపెడ్ కొనివ్వాలని నిర్ణయించుకున్నాడు.

ఇద్దరూ బస్టాండ్‌కి, గుడికి, దర్గాకు వెళ్లి భిక్షాటన చేసి రోజూ దాదాపు 300 నుండి 400 రూపాయలు సంపాదించేవారు.కొందరు వారికి ఆహారం ఇస్తుండడంతో రెండు పూటల కడుపు నిండేది.ఇలాంటి పరిస్థితిలో సంతోష్ నాలుగేళ్లలో రూ.90 వేలు దాచుకున్నాడు.ఆ మొత్తంతో శనివారం నగదు చెల్లించి మోపెడ్ కొనుగోలు చేశాడు.దానికి వెనుక వైపున మరో రెండు టైర్లను సపోర్ట్‌గా వేయించుకున్నాడు.ప్రస్తుతం ఆ మోపెడ్‌‌పై ఇప్పుడు భిక్షాటన చేస్తున్నాడు.ప్రస్తుతం ఆయన కథనం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube