జలుబు మాయం కావాలంటే పుదీనా ఆవిరి....పుదీనాతో మరిన్ని ఉపయోగాలు

వానలు ప్రారంభం అయ్యాయి.ఈ వానలతో పాటు దగ్గు, జలుబు వంటివి కూడా తొందరగా వచ్చేస్తూ ఉంటాయి.

 Mint Vapor For Reducing Cold And Other Health Benefits Of Mint Details, Mint Vap-TeluguStop.com

మందులను ఉపయోగించకుండా మనకు అందుబాటులో ఉండే పుదీనా తో సులభంగా తగ్గించుకోవచ్చు.పుదీనా దగ్గు,జలుబు వంటి వాటిని తగ్గించటమే కాకుండా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా సహాయపడుతుంది.

పుదీనా ఉపయోగాలను తెలుసుకుంటే మీరు పుదీనాను ప్రతి రోజు తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకుంటారు

జలుబు,దగ్గుతో బాధపడుతున్నప్పుడు మరిగే నీటిలో కొన్ని పుదీనా ఆకులను వేసి ఆవిరి పట్టాలి.ఆవిరి పట్టినప్పుడు నోటితో పీల్చి ముక్కుతో వదిలేయాలి.

ఈ విధంగా ఆవిరి పట్టటం వలన గొంతు,ముక్కు,నోరు శుభ్రపడి ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది

పుదీనా ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే మతిమరుపు తగ్గి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.పుదీనాను ప్రతి రోజు ఎదో రూపంలో తీసుకోవటం మంచిది

నెలసరి సమయంలో వచ్చే నొప్పులను పుదీనా చాలా సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది

పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లూ రకరకాల అలర్జీలనూ, ఆస్తమానూ తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి

పుదీనాలో యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు సమృద్ధిగా ఉండుట వలన దంత క్షయాన్ని నివారించటమే కాకుండా దంతాలూ, నాలుకనూ శుభ్రం చేసి నోటి దుర్వాసనను పోగొడటంలో సహాయపడుతుంది

Telugu Benefits Mint, Cough, Benefits, Mint Vapor, Pudina, Reduce-Telugu Health

ప్రతి రోజు నాలుగు పుదీనా ఆకులను నమలటం వలన దంతాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి

పుదీనా తరచుగా తీసుకోవటం అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.భోజనం తర్వాత ఒక కప్పు పుదీనా టీ త్రాగితే జీర్ణక్రియ బాగుంటుంది

పుదీనా ఆకులలో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌ సి, డి, ఇ-లతోపాటు తక్కువ మొత్తంలో విటమిన్‌ బి కాంప్లెక్స్‌ ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగటానికి సహాయపడుతుంది

ఇన్ని ప్రయోజనాలు ఉన్న పుదీనాను క్రమం తప్పకుండ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube