స్వీట్స్( Sweets ) అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.స్వీట్స్ అన్న మాట వినపడినా చాలు కొందరికి నోరూరిపోతుంటుంది.
ఆల్మోస్ట్ అందరూ స్వీట్స్ ను ఇష్టపడతారు.అందరికీ ఏదో ఒక ఫేవరెట్ స్వీట్ అనేది ఉంటుంది.
ఏదైనా స్పెషల్ డే వచ్చిందంటే చాలు ఖచ్చితంగా స్వీట్స్ ఉండాల్సిందే.అలాగే ఉద్యోగం వచ్చిన, ప్రమోషన్ వచ్చిన, బిజినెస్ లో మంచి లాభాలు పొందిన తప్పకుండా నోరు తీపి చేసుకుంటూ ఉంటారు.
ఏదైనా శుభకార్యం జరిగిందంటే ముందు ఉండేవి స్వీట్సే.
అయితే కొందరు స్వీట్స్ పై ఉన్న మక్కువతో ఎప్పుడు చూడు వాటిని తింటుంటారు.
ఆకరికి ఉదయం కూడా స్వీట్స్ లాగించేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే డేంజర్ లో పడ్డట్టే.సాధారణంగా స్వీట్ ఐటమ్స్ లో మైదా, చక్కెర ను ఎక్కువగా వినియోగిస్తారు.
అందువల్ల స్వీట్స్ ను అధికంగా తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు( Health problems ) తలెత్తుతాయి.అందులోనూ ఉదయం పూట స్వీట్స్ అసలు తీసుకోకూడదు.

ఉదయం అంటే పరగడుపున ఏమీ తినకుండా స్వీట్లు తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ( Blood sugar levels )అమాంతరంగా పెరుగుతాయి.దీనివల్ల డయాబెటిస్ వచ్చే రిస్క్ రెట్టింపు అవుతుంది.అలాగే బ్రేక్ ఫాస్ట్ లో కూడా స్వీట్స్ అనేవి లేకుండా చూసుకోవాలి.అలాగే ఎంత ఇష్టం ఉన్నప్పటికీ స్వీట్స్ చాలా మితంగా తీసుకోవాలి.లేదంటే స్వీట్స్ మీ మెదడు పనితీరును నెమ్మదించేలా చేస్తాయి

బద్దకాన్ని పెంచుతాయి.ఏకాగ్రతను దెబ్బ తీస్తాయి.అంతేకాదు స్వీట్స్ ను అధికంగా తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్( Gain weight ) అవుతారు.బ్లడ్ లో కొలెస్ట్రాల్( Cholesterol ) పెరుగుతుంది.కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకు ముప్పు కూడా పెరుగుతుంది.ఓవర్ గా స్వీట్స్ ను తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది.
దీంతో అనేక జబ్బులు చుట్టుముడతాయి.కాబట్టి స్వీట్స్ ను మితంగా తీసుకోండి.
ఉదయం పూట అయితే పూర్తిగా అవాయిడ్ చేయండి.