వర్షాకాలం ప్రారంభం అయింది.ఈ సీజన్లో వర్షాలే కాదు.రోగాలు కూడా అధికంగానే ఉంటాయి.ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు ఈ కాలంలో తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి.వీటిని నివారించుకునేందుకు అనేక మందులు వాడతారు.అయితే ఒక్కోసారి ఎన్ని మందులు వాడినా.
జలుబు, దగ్గు సమస్యలు ఓ పట్టాన వదలవు.దాంతో నానా ఇబ్బందులు పడుతుంటారు.
అయితే ఈ సమస్యలను నివారించడంలో అరటి పువ్వు అద్భుతంగా సహాయపడుతుంది.
అరటి చెట్టు నుంచి వచ్చే ఈ అరటి పువ్వులో ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.
అందుకే అరటి పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో జబ్బులను కూడా నివారించే శక్తి అరటి పువ్వుకు ఉంది.
ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధ పడే వారు ప్రెష్‌గా ఉన్న అరటి పువ్వును తీసుకుని మెత్తగా నూరి రసం తీసుకోవాలి.ఆ రసంలో కొద్దిగా మిరియాల పొడి కలిపి సేవించాలి.
ఇలా చేస్తే జలుబు, దగ్గు సమస్యలు త్వరగా తగ్గు ముఖం పడతాయి.

అలాగే అరటి పువ్వును తీసుకోవడం ద్వారా మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.ముఖ్యంగా అరటిపువ్వును కూరగా చేసుకుని ఆరగించడం వల్ల అధిక ఒత్తిడి, ఆందోళన, తలనొప్పి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పరార్ అవుతాయి.
వారంలో ఒకటి, రెండు సార్లు అరటి పువ్వును తీసుకుంటే.
రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.క్యాన్సర్‌కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్ నాశనం అవుతాయి.
మరియు ఒంట్లో అధిక వేడి కూడా తగ్గు ముఖం పడుతుంది.కాబట్టి జులుబు, దగ్గు సమస్యలు ఉన్న వారే కాదు.
ఎవ్వరైనా అరటి పువ్వును డైట్లో చేర్చుకోవచ్చు.