మెంతి కూరలో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసా?

మెంతి ఆకులతో కూర, పచ్చడి చేసుకుంటూ ఉంటారు.అయితే కొంత మంది కాస్త చేదుగా ఉంటుందని తినటం మానేస్తారు.

 Best Health Benefits Of Fenugreek Leaves Details,health Benefits ,fenugreek Leav-TeluguStop.com

అయితే ఈ ఆకులో ఏ ఆకుకూరల్లో లేనన్ని పోషకాలు ఉన్నాయి.అనేక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తప్పకుండ మెంతి కూరను ఆహారంలో భాగంగా చేసుకుంటారు.ఇప్పుడు ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

మెంతి ఆకులు రక్తంలోని లిపిడ్ లెవల్స్‌పై ప్రభావాన్ని చూపుతాయి.శరీరంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ ని పెంచుతాయి.రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో పది మెంతి ఆకులను వేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి త్రాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

లివర్ ని శుభ్రం చేసి లివర్ సమస్యలను తగ్గిస్తుంది.

కడుపులో గ్యాస్ సమస్యను తగ్గించటమే కాకుండా ప్రేగులను శుభ్రం చేస్తుంది.

Telugu Biotic, Bad Cholesterol, Lipid Levels, Diabetes, Fenugreek, Benefits, Hea

మెంతి కూరలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.దాంతో మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది.

మెంతి కూరలో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండుట వలన రక్తం గడ్డకట్టకుండా మరియు పలుచగా ఉండేలా చేస్తుంది.

దాంతో హార్ట్ అటాక్, ఇతర గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ.

మెంతి ఆకుల పేస్ట్ ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేస్తే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube