జుట్టు విపరీతంగా ఊడిపోతుందా? రోజురోజుకు హెయిర్ పల్చగా మారుతుందా? జుట్టు రాలడాన్ని( Hairfall ) అడ్డుకునేందుకు, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు ప్రయత్నాలు షురూ చేశారా? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.బెండకాయలు( Okra ) ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయన్న సంగతి మనందరికీ తెలుసు.
పైగా తక్కువ ధరకే లభించడంతో ప్రతి ఇంట్లోనూ వారానికి ఒకసారైనా బెండకాయను వండుతుంటారు.
అయితే ఆరోగ్య పరంగానే కాకుండా జుట్టు సంరక్షణకు కూడా బెండకాయలు ఉపయోగపడతాయి.
ముఖ్యంగా రెండు బెండకాయలతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేశారంటే హెయిర్ ఫాల్ తగ్గడమే కాకుండా మీ జుట్టు రెండింతలు అవుతుంది.అందుకోసం ముందుగా రెండు బెండకాయలను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న మక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాసు వాటర్ వేసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.

అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.గోరువెచ్చగా అయ్యాక ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ అయిల్( Coconut Oil ) వేసి బాగా మిక్స్ చేస్తే మంచి హెయిర్ సీరం రెడీ అవుతుంది.ఈ సీరంను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి తలస్నానం చేయాలి.

వారానికి ఒకసారి ఈ విధంగా చేయడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి.బెండకాయలో ఉన్న విటమిన్ ఎ మరియు విటమిన్ సి జుట్టు రాలడాన్ని తగ్గించి, కొత్త జుట్టు ఎదుగడానికి సహాయపడతాయి.అలాగే బెండకాయకు రక్త ప్రసరణను మెరుగుపరిచే గుణాలు ఉన్నాయి.బెండకాయలోని యాంటీఆక్సిడెంట్లు మరియు ఫోలిక్ యాసిడ్ జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి.అలాగే అవిసె గింజలు కూడా ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, జుట్టు సంరక్షణకూ తోడ్పడతాయి.పైన చెప్పిన విధంగా బెండకాయ మరియు అవిసె గింజలతో సీరం తయారు చేసుకుని వాడితే జుట్టు రాలడం తగ్గి దట్టంగా పెరుగుతుంది.







