ఉదయానికి ముఖ చర్మం గ్లోయింగ్ గా కనిపిస్తే.ఇక వారి ఎనర్జీ రెట్టింపు అవుతుంది.
కానీ వర్క్ స్ట్రెస్, ఆహారపు అలవాట్లు, కంటినిండా నిద్ర లేకపోవడం, మద్యపానం, ధూమపానం తదితర కారణాల వల్ల కొందరి ముఖం ఉదయానికి చాలా డల్ గా కనిపిస్తుంది.అటువంటి ముఖ చర్మం తో బయట కాలు పెట్టడానికి కూడా ఇష్టపడరు.
ఈ జాబితాలో మీరు ఉండకూడదు అంటే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరంను వాడాల్సిందే.ఈ సీరంను రోజు నైట్ రాసుకుంటే ఉదయానికి మీ ముఖ చర్మం సూపర్ గ్లోయింగ్ గా, షైనీ గా మెరుస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా రెండు ఉసిరికాయ( Indian gooseberry )లను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.ఈ తురుము నుంచి ఉసిరికాయ జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఉసిరి జ్యూస్ వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ Aloe Vera Gel ), మూడు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose water ), వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, రెండు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని అన్ని కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

తద్వారా మన సీరం సిద్ధమవుతుంది.ఈ సీరం ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఆపై తయారు చేసుకున్న సీరం ను ముఖానికి అప్లై చేసి స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి.
ఈ హోమ్ మేడ్ సీరంను నైట్ వాడితే ఉదయానికి చర్మం కాంతివంతంగా ఆకర్షణీయంగా మారుతుంది.
ముఖంలో మంచి గ్లో వస్తుంది.పైగా ఈ సీరం ను వాడటం వల్ల మొండి మచ్చలు దూరం అవుతాయి.
వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.పిగ్మెంటేషన్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
మరియు చర్మం యవ్వనంగా సైతం మెరుస్తుంది.